దేశంలోని ప్రధాన నగరాల్లో షాపింగ్ మాల్స్ వెలవెల బోతున్నాయి. స్థలం అతి తక్కువగా నిండుతున్న షాపింగ్ మాల్స్ సంఖ్య పెరిగిందని స్థిరాస్తి సేవల సంస్థ నైట్ ఫ్రాంక్ తెలిపింది.
రాష్ట్రంలో డీజిల్ మాఫియా రోజు రోజుకూ పెరుగుతోంది. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. దానికి అడ్డుకట్ట వేసేందుకు ఎస్ఓటీ అధికారులు రంగంలోకి దిగారు. తెలంగాణలో అక్రమంగా డీజిల్ అమ్ముతున్న ముఠా గట్టు రట్టు చేశారు.
కాసేపట్లో మద్యం దుకాణాలు బంద్ కానున్నాయి. సాయంత్రం 6 గంటల నుంచి జంటనగరాల్లో వైన్ షాపులు క్లోజ్ అవనున్నాయి. అంతేకాకుండా.. బార్ అండ్ రెస్టారెంట్లు, కల్లు దుకాణాలు మూసివేయాలని వైన్ షాపులకు పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. కాగా.. హోలీ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్ తో పాటు రాచకొండ కమిషనరేట్ పరిధిలో మద్యం అమ్మకాలు జరగొద్దని మద్యం దుకాణాలు మూయాలని సూచించారు. మరోవైపు.. స్టార్ హోటల్స్, రిజిస్టర్డ్ క్లబ్బులు యథావిధిగా నడవనున్నాయి. ఈమేరకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ…
Jobs: దేశంలోని ఇ-కామర్స్, రిటైల్, ఎఫ్‌ఎంసిజి, లాజిస్టిక్స్ రంగాలలో చాలా ఉద్యోగాలు రానున్నాయి. నవంబర్ నాటికి ఈ రంగాల్లోని కంపెనీలు పెద్ద ఎత్తున నియామకాలకు సిద్ధమవుతున్నాయి.
నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు.
డ్రగ్స్ సమాజానికి పట్టిన చీడ.. డ్రగ్స్ వాడకాన్ని రాష్ట్రం నుంచి తరిమేయాలని.. అది సామాజిక బాధ్యతతో ప్రతీ ఒక్కరు సహకారం అందించినప్పుడే సాధ్యం అవుతుందన్నారు తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్.. దేశవ్యాప్తంగా విస్తృతమవుతున్న గంజాయి తదితర నార్కోటిక్ డ్రగ్స్ వాడకాన్ని తెలంగాణ నుంచి కూడా సమూలంగా నిర్మూలించడానికి పోలీస్ అధికారులు వినూత్నరీతిలో బాధ్యత కలిగిన మానవులుగా ఆలోచనలు చేయాలన్నారు.. అదొక సామాజిక ఉద్యమంగా మలచిననాడే డ్రగ్స్ కంట్రోల్ సాధ్యమవుతుందని రాష్ట్ర పోలీసు, ఎక్సైజ్ శాఖ అధికారులకు పిలుపునిచ్చారు…