బంగ్లాదేశ్‌తో టీ20 సిరీస్‌లో చివరి మ్యాచ్‌లో భారత జట్టు తలపడనుంది. టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది. సూర్య కుమార్ యాదవ్ సారథ్యంలో ఇప్పటికే వరుసగా రెండు మ్యాచ్‌ల్లో విజయదుందుభి మోగించింది.
Trains Cancelled: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో ఇప్పటి వరకు 450కి పైగా రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. దీంతో పాటు 140 రైళ్లు దారి మళ్లించగా.. మరో 13 రైళ్లను పాక్షికంగా క్యాన్సిల్ చేసినట్లు వెల్లడించింది. రద్దైన వాటిలో సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు పలు పాసింజర్ రైళ్లు కూడా ఉన్నాయి. రైల్వే ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో ట్రైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
గర్భం ధరించడానికి కష్టపడుతున్న జంటల ప్రయాణంలో మగ వంధ్యత్వం ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్ (IVF) ఒక పరివర్తనాత్మక పరిష్కారంగా ఉద్భవించింది. ఇది మగ కారకం వంధ్యత్వంతో బాధపడుతున్న చాలా మందికి ఆశను అందిస్తుంది. ఈ సమగ్ర అన్వేషణ పురుష వంధ్యత్వం యొక్క సంక్లిష్టతలు, చికిత్సలో ఐవిఎఫ్ పాత్ర, పునరుత్పత్తి సాంకేతికతలలో పురోగతి మరియు వ్యక్తులు మరియు జంటలపై భావోద్వేగ ప్రభావాన్ని పరిశీలిస్తుంది.
మొన్నటి దాకా ఏపీలో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అక్కడి ప్రచారంలో బిజీగా ఉన్న బాలకృష్ణ ఎలక్షన్స్ అయ్యాక బాలయ్య బాబు హైదరాబాద్ వచ్చి ఇప్పుడు మళ్ళీ సినిమాలు, బసవతారకం హాస్పిటల్ పనులలో నిమగ్నమయ్యారు. తాజాగా కాజల్ నటించిన ; సత్యభామ ‘ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కి కూడా వచ్చారు బాలయ్య. Gangs Of Godavari: ‘గాంగ్స్ ఆఫ్ గోదావరి’ లో అంజలి నోట బూతులు.. ఏంటి ఇలా అనేసింది.. ఇక డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో…
ఆకాశమే హద్దుగా వెళ్తున్న బంగారం ధరలకు బ్రేక్ పడినట్లయింది. ఇకపోతే గడిచిన వారం రోజుల నుంచి గోల్డ్ ధరలు కాస్త తగ్గుతూ వస్తున్నాయి. ఇదివరకు గడిచిన 6 రోజుల్లో 10 గ్రా. ల 24 క్యారెట్ల బంగారంపై సుమారు 3వేల రూపాయల వరకు తగ్గింది. ఇదే కొనసాగితే ఈ నెల చివరికి గోల్డ్ రేటు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇక బంగారంతోపాటుగా వెండి ధర కూడా తగ్గుతూ వస్తోంది. గత వారంలో…
ఇండిగో విమానం రద్దవడంతో మదర్స్ డే రోజు తన అమ్మను కలవలేకపోయానని.. అనుభా పాండే అనే జర్నలిస్ట్ తెలిపారు. 11వ తేదీన ఉదయం 10.40 నిమిషాల విమానానికి ఢీల్లీ నుంచి హైదరాబాద్ వెళ్లాలని ఆమె నిర్ణయించుకున్నారు.
Heavy Traffic Jam: యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పంతంగి టోల్‌ప్లాజా వద్ద విజయవాడ-హైదరాబాద్ జాతీయ రహదారిపై శని, ఆదివారల్లో తెల్లవారుజామున భారీ వాహనాల రద్దీ పెరిగింది.
హైదరాబాద్ లో వాహన రద్దీ నెలకొంది. ఏపీలో ఈనెల 13న శాసనసభ, లోక్‌సభ ఎన్నికలు ఉండటంతో ఓటు హక్కు వినియోగించుకునేందుకు నగర వాసులు బయలు దేరారు. హైదరాబాద్‌లో నివసించే ఏపీ వాసులంతా తమ సొంత గ్రామాలకు పయణమవుతున్నారు.
మన నీడ మనం ఎక్కడికి వెళ్లినా మన వెంటే ఉంటుంది. కూర్చున్నా.. నిల్చున్నా.. పడుకున్నా వెన్నంటే ఉంటుంది. ఇక పిల్లలు అయితే.. నీడతో అప్పుడప్పుడు ఆడుతూ ఉంటారు. ఎప్పటికీ మన వెంటే ఉండే నీడ కొన్ని సందర్భాల్లో మాయమవుతుంది.
హైదరాబాద్ కే పరిమితమైన మజ్లిస్ పార్టీ నెమ్మదిగా దేశంలోని పలు రాష్ట్రాలకు విస్తరిస్తోంది. బీజేపీని కట్టడి చేసేందుకు మజ్లిస్ అత్యధిక స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయించినప్పటికీ రాజకీయ పరిస్థితుల కారణంగా మార్పులు చేయాల్సి వచ్చిందని పార్టీ ప్రతినిధులు తెలిపారు.