తెలుగు రాష్ట్రాల్లో గత నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో వణికిపోతున్నాయి. ఆకాలంగా కురుస్తున్న వానలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈదురుగాలులతో కురుస్తున్న వర్షాల వల్ల పంట నష్టపోయి ఆవేదన చెందుతున్నారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయంలో అకాల వర్షాల దెబ్బ కొట్టాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు మరో నేడు, రేపు మళ్లీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది.
Also Read : Bhookailas: 65 ఏళ్ళ ‘భూకైలాస్’!
ఇప్పటికే పిడుగులు.. ఉరుములు.. మెరుపులతో తెలుగు రాష్ట్రాల్లో భారీగా వర్షాలు కురిశాయి. శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు చాలా జిల్లాల్లో ఏకధాటిగా వర్షం కురిసింది. ముఖ్యంగా తెలంగాణలో గరిష్టంగా ములుగు జిల్లా వెంకటాపురం మండలం ఆలుబాకలో 13.6 సెంటీమీటర్ల వాన కురిసింది. రాష్ట్రవ్యాప్తంగా 8 జిల్లా్ల్లో 7 సెంటిమీటర్లకు పైగా వర్షపాతం నమోదైంది. ఇంకో వైపు తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో పడిపోయాయి. 5 డిగ్రీల సెల్సియస్ స్థాయిలో ఉష్ణోగ్రతలు తగ్గాయి. ఈదురు గాలులతో ప్రజలు వణికిపోతున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో ఇవాళ, రేపు కూడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతో కూడిన వాన కురుస్తుందని పేర్కొంది.
Also Read : Nikki Tamboli: ఆ బ్యాక్ చూపించి బెంబేలెత్తించకే భామ..
గత నాలుగు రోజులుగా హైదరాబాద్ నగరం పూర్తిగా నల్లటి మేఘాలతో కమ్ముకుని ఉంది. గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలోని రోడ్లు పూర్తిగా తడిసిపోయాయి. దీంతో హైదరాబాద్ వాసులు వాన ధాటికి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ట్రాఫిక్ సమస్యలతో సతమతమైనారు. రోడ్లపై నీరు నిలవడంతో పాటు ట్రాఫిక్ భారీగా జామ్ కావడంతో వాహనదారులు నానా అవస్థలు పడ్డారు. అలాగే తెలగాణలోని పలు జిల్లాలో ఇప్పటికే వడగళ్ల వాన కురిసింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. టామాట, మొక్క జొన్న, వరి, శనగాతో పాటు మామిడి తోటలు కూడా తీవ్రంగా నష్టపోయాయి.