నాంపల్లి ఏరియా హాస్పిటల్ లో 5 పడకల డయాలసిస్ కేంద్రం, బ్లడ్ బ్యాంక్ ను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. డయాలసిస్ కేంద్రాల సంఖ్యను తెలంగాణ ప్రభుత్వంలో 3 నుంచి 102 కు పెంచాము అని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో దాదాపు 12వేల మంది డయాలసిస్ చేయించుకుంటున్నారు, వారిలో 10వేల మందికి ఉచితంగా ప్రభుత్వం డయాలసిస్ చేయిస్తున్నది అని వైద్యారోగ్యశాఖ మంత్రి పేర్కొన్నారు. తెలంగాణలో డయాలసిస్ రోగులకు ఆర్థికంగా భరోసా ఇచ్చేందుకు ఆసరా పింఛను, ఉచిత బస్ పాస్‌కూడా ఇస్తున్నాము అని అన్నారు.
Also Read : Vizag Steel Plant: EOIపై ఆసక్తి చూపని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు
ప్రతి సంవత్సరం150 వరకు కిడ్నీ ట్రాన్స్‌ప్లాంటేషన్‌లు జరుగుతున్నాయి అని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య శ్రీ కింద 10 లక్షల రూపాయల వరకు ప్రభుత్వమే భరిస్తున్నది.. బయట చేస్తే 20 లక్షల వరకు ఖర్చు అవుతుంది కానీ.. ట్రాన్స్‌ప్లాంటేషన్ తర్వాత అవసరమయ్యే మందులను కూడా ఉచితంగా జీవిత కాలం అందిస్తున్నాము అని ఆయన పేర్కొన్నారు. కిడ్నీ రోగుల కోసం ఏడాదికి 200 కోట్లు ఖర్చు చేస్తే, అందులో ఒక్క డయాలసిస్ రోగుల కోసం ఏడాదికి 100 కోట్లు ఖర్చు చేసున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు.
Also Read : Tiger : హైదరాబాద్ పరిసరాల్లో పులి సంచారం
తెలంగాణ ఏర్పడే నాటికి మన రాష్ట్రంలో 28 ప్రభుత్వ బ్లడ్ బ్యాంకులు ఉంటే, ఇపుడు ఆ సంఖ్యను 56 కి పెంచుకున్నాము అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు తెలిపారు. 27 బ్లడ్ బ్యాంక్ లకు కాంపోనెంట్ సపరేటర్స్ ఇచ్చాము.. వాటి వల్ల ఒక యూనిట్ రక్తాన్ని ముగ్గురు నలుగురికి వాడుతున్నాం.. కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ ను త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తాం అని మంత్రి హరీశ్ రావు గుర్తు చేశారు. ఇందుకోసం బడ్జెట్లో సీఎం కేసీఆర్ 250 కోట్ల రూపాయలు కేటాయించారు అని వెల్లడించారు. 6.5 లక్షల మంది గర్భిణులకు వీటిని అందిస్తామన్నారు. ఇప్పటికే లక్ష కిట్లు జిల్లాలకు పంపించాం… మరో లక్ష సేకరిస్తున్నాం అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీష్ రావు అన్నారు.