Holi Celebrations: హైదరాబాద్ నగర వ్యాప్తంగా హోలీ వేడుకలు జోరుగా కొనసాగుతున్నాయి. సప్తవర్ణాల్లో కుర్రకారు హుషారుగా పాటలు పాడుతూ డ్యాన్స్ లు చేస్తున్నారు. ఒకరికి ఒకరు ముఖానికి సహజ సిద్ధమైన రంగులు అద్దుకుని కేరింతలు కొడుతున్నారు.
Hit And Run Case: హైదరాబాద్ లో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. జగద్గీరిగుట్ట, షాపూర్ లలో వరుస రోడ్డు ప్రమాదాలు చేసిన కారు.. జగద్గీరి గుట్ట ఔట్ పోస్ట్ ప్రయాణికులను గుద్ది ఆపకుండా కారు వెళ్లిపోయింది.
Jalsa Shankar: జల్సా శంకర్ అలియాస్ చోర్ శంకర్ అలియాస్ మంచి దొంగ.. ఇన్ని పేర్లున్న ఈ శంకర్ ఎవరో తెలుసా? ఇతను ఒక పెద్ద దొంగ. ఇప్పటికి దొంగతనాల్లో సెంచరీ కొట్టాడాంటే నమ్మండి. ఇతనికి ఉన్న మంచి అలవాటు ఏంటంటే.. ఏ ఇంట్లో అయితే దొంగతనం చేస్తాడో ఆ ఇంటి నుంచి చోరీ చేసుకుని పోయిన వస్తువులు అన్నింటిని ఒక చిట్టా రాసి టేబుల్ మీద పెట్టి మరీ వెళ్ళిపోతాడు. ఏమేమి వస్తువులు తన దొంగలించాడో…
Crime: హైదరాబాద్ మహా నగరంలో దారుణం చోటు చేసుకుంది. బోరబండ పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజీవ్ గాంధీ నగర్ సైట్ త్రీలో భార్య పద్మ మీద అనుమానంతో భర్త నరేంద్ర హత్య చేశాడు.
మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అసహనానికి గురికాకండి అని స్పీకర్ ప్రసాద్ కుమార్ తెలిపారు. ఇది మంచిది కాదు.. సభను తప్పుదోవ పట్టించడం సరికాదు అన్నారు. నన్ను ప్రశ్నించడమే తప్పు.. నేను ఏం తప్పుదోవ పట్టించానో చెప్పండి అని జగదీష్ రెడ్డి అడిగారు. ఈ సభలో సభ్యులందరికి పెద్దగా స్పీకర్ అక్కడ కూర్చొన్నారు తప్పా స్పీకర్ ది ఈ సభ కాదు.. జగదీష్ రెడ్డి ఏం తప్పు మాట్లాడలేదు.. సభలో అందరికీ సమాన హక్కులు ఉంటాయని జగదీష్…
BRS MLC Pochampally: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డికి మరోసారి పోలీసులు నోటీసులు జారీ చేశారు. మొయినాబాద్ లోని ఫామ్ హౌస్ లో కోడి పందాలు, క్యాసినో కేసులో నోటీసులు అందజేశారు.
Lift Accident: 15 రోజుల వ్యవధిలో మరో పసిప్రాణాన్ని లిఫ్ట్ బలిగొంది. నాంపల్లిలో లిఫ్ట్లో ఇరుక్కుని నరకం అనుభవించి చిన్నారి చనిపోయిన ఘటన మర్చిపోక ముందే.. అలాంటి సంఘటనే మరొకటి మెహదీపట్నంలో జరిగింది.
HMDA : తెలంగాణ ప్రభుత్వం హెచ్ఎండీఏ పరిధిని విస్తరించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. పరిధిని విస్తరిస్తామని ఎప్పటి నుంచో ప్రభుత్వం చెబుతూనే ఉంది. ఈ రోజు దాన్ని పూర్తి చేసింది. హెచ్ ఎండీఏ పరిధిలోకి 36 రెవెన్యూ గ్రామాలను కలిపేసింది. దీంతో హెచ్ ఎండీఏ పరిధిలో 1355 గ్రామాలు, 104 మండలాలు, 11 జిల్లాల వరకు పరిధి పెరిగిపోయింది. ఇంతకు ముందు 7 జిల్లాల వరకు మాత్రమే ఉండేది. కానీ ఇప్పుడు 11 జిల్లాల…
Hyderabad: హైదరాబాద్లోని కాటేదాన్లో భారీగా కల్తీ నిత్యవసర వస్తువుల తయారీని పోలీసులు గుర్తించి దాడి నిర్వహించారు. రాజేంద్రనగర్ ఎస్ఓటీ బృందం ఈ ఆపరేషన్లో పాల్గొని 20 రకాల కిరాణా వస్తువులను స్వాధీనం చేసుకుంది. కల్తీ వ్యాపారస్తులు ప్రమాదకరమైన రసాయనాలు ఉపయోగించి పలు నిత్యవసర వస్తువులను తయారు చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. కేటుగాళ్లు ప్రజల్లో ఎక్కువగా వినియోగించే ప్రముఖ బ్రాండ్లను టార్గెట్ చేసి కల్తీ ఉత్పత్తులను తయారు చేశారు. వీటిని అసలు బ్రాండ్ల ప్యాకింగ్లోనే మార్కెట్లోకి…
Jawahar Nagar: హైదరాబాద్లోని జవహర్ నగర్లో సంచలనం సృష్టించిన జంట హత్య కేసు మిస్టరీను పోలీసులు ఛేదించారు. ఈ కేసులో నిందితులుగా లక్ష్మి, ఆమె ప్రియుడు అరవింద్ కుమార్ను అరెస్ట్ చేశారు. ప్రేమ వివాహానికి అడ్డుగా మారుతున్నారని భావించి లక్ష్మి తన సొంత అక్క, తల్లిని హత్య చేసినట్లు విచారణలో వెల్లడైంది. ప్రియుడుతో కలిసి అమానుష చర్య: బీహార్కు చెందిన అరవింద్ కుమార్తో ప్రేమలో ఉన్న లక్ష్మి, అతనితో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకుంది. ఈ విషయాన్ని ఆమె…