ఉద్యోగం సాధించి లైఫ్ లో సెటిల్ అవ్వాలని భావిస్తున్నారా? అయితే మీ డ్రీమ్ జాబ్ ను సొంతం చేసుకునే ఛాన్స్ వచ్చింది. నిరుద్యోగులకు హైదరాబాద్‌లోని భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) గుడ్ న్యూస్ అందించింది. వివిధ విభాగాల్లో 32 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. భర్తీకానున్న పోస్టుల్లో ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీ (EAT) 08, టెక్నీషియన్ C 21, జూనియర్ అసిస్టెంట్ 03 ఉన్నాయి.
Also Read:Hyderabad Metro : హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్… మెట్రో రైలు సమయం పొడిగింపు
అభ్యర్థులు పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ/డిప్లొమా/ఐటీఐ పైసై ఉండాలి. అభ్యర్థుల వయసు 01.03.2025 నాటికి 28 ఏళ్లలోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటాగిరి వర్గాల వారికి వయోసడలింపు నిబంధనలు వర్తిస్తాయి. ఈ పోస్టులకు అభ్యర్థులను రాతపరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి టెక్నీషియన్, జూనియర్ అసిస్టెంట్ కు రూ.21,500 – రూ.82,000, ఇంజనీరింగ్ అసిస్టెంట్ ట్రైనీకి రూ.24,500 – రూ.90,000 జీతం అందిస్తారు. జనరల్/ఓబీసీ అభ్యర్థులు రూ. 250 దరఖాస్తు ఫీజు చెల్లించాలి. SC/ST/PwBD/ మాజీ సైనికులకు ఫీజు నుంచి మినహాయింపు కల్పించారు. అర్హత, ఆసక్తి గల వారు ఆఫ్ లైన్ విధానంలో ఏప్రిల్ 9 వరకు అప్లై చేసుకోవచ్చు. పూర్తి సమాచారం కోసం ఈ లింక్ పై క్లిక్ చేయండి.