హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ సమీపంలోని గురుమూర్తి నాగర్లోని శ్రీ వినాయక దేవాలయంలో విగ్రహాలు చోరీకి గురైన విషయం తెలిసిందే. ఈ విగ్రహాల చోరీ కేసును పోలీసులు ఛేదించారు. అక్కచెల్లెలు స్వర్ణలత, పావని శివపార్వతుల విగ్రహాలు దొంగతనం చేశారు. కుటుంబంలో తరచూ ఒకరు చని పోతుండటంతో విగ్రహాన్ని ప్రతిష్టించాలని బాబా చెప్పారు. బాబా మాటలు విని దేవుడు విగ్రహాలు కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారు. విగ్రహాలు కొనేందుకు డబ్బులు సరిపోకపోవడంతో గుడిలో విగ్రహాలు కాజేసేందుకు స్కెచ్ వేశారు. ఎస్ఆర్ నగర్లో…
యువకులు వాహనాలను వేగంగా నడిపి ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇలాంటి సంఘటనలు మూడు పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరుసగా చోటుచేసుకుంటున్నాయి. బైక్లు, కార్లలో వెళ్తున్న యువకులు మితిమీరిన వేగంతో వెళ్లడంతో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో యువకులు ప్రాణాలు కోల్పోతున్నారు, వాహనాలు వేగంగా ఉండడంతో వాటిని కంట్రోల్ చేయలేక ప్రాణాలు విడుస్తున్నారు. తాజాగా నార్సింగి పరిధిలో ఓ ప్రమాదం జరిగింది. ఓవర్ స్పీడ్ తో మరో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు బలయ్యారు.
హబ్సిగూడ కుటుంబం మృతి సూసైడ్ నోట్లో కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. పిల్లల్ని ఇద్దరిని చంపి లెక్చరర్ దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆత్మహత్య చేసుకున్నట్లు సూసైడ్ లెటర్లో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా శ్రీ చైతన్య కాలేజీలపై రెండవ రోజు ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. నిన్న ఆదాయపు పన్ను శాఖ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఢిల్లీ, ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల్లో చైతన్య కళాశాలల శాఖల్లో ఏకకాలంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
Lift Breakdown: హైదరాబాద్లోని అంబర్పేట్లో ఘోర లిఫ్ట్ ప్రమాదం చోటు చేసుకుంది. యూనిసన్ గ్రూప్ ఆఫ్ స్కూల్లో జరిగిన ఈ ప్రమాదంలో మొదటి అంతస్తులో ఉన్న లిఫ్ట్ వైర్ తెగిపోవడంతో, లిఫ్ట్ ఒక్కసారిగా గ్రౌండ్ ఫ్లోర్కు పడిపోయింది. ఈ ఘటన సమయంలో లిఫ్టులో 13 మంది ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనలో ఆరుగురికి గాయాలైనట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు పాఠశాల యాజమాన్యం. Read Also: Hyderabad: క్రికెట్ అభిమానులపై…
Champions Trophy Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ-2025 తుది అంకానికి చేరింది. నేడు దుబాయ్ వేదికగా ఐసీసీ ఛాంపియన్ ట్రోఫీ ఫైనల్ లో న్యూజిలాండ్ తో అమీతుమీ తేల్చుకోబోతున్న భారత్.. ఫైనల్ మ్యాచ్ కోసం హైదరాబాద్ క్రికెట్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు.
ఫాల్కన్ స్కామ్ కేసులో ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారిక ప్రకటన చేసింది. ఈ కేసులో ఈడీ సంచలన విషయాను వెల్లడించింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో చార్టర్డ్ ఫ్లైట్ ని సీజ్ చేసామని ఈడీ అధికారులు వెల్లడించారు. దుబాయ్ నుంచి వచ్చిన ఫ్లైట్ ని ఎయిర్ పోర్టులో స్వాధీన పరచుకున్నామన్నారు. ఫాల్కన్ కేసులో ప్రధాన నిందితుడు అమర్ దీప్ అమెరికాకు చెందిన కంపెనీ పేరు మీద చార్టెడ్ ఫైట్ ని కొనుగోలు చేశాడన్నారు. Also Read:Child Trafficking…
అక్రమ సంబంధాలు... మానవ సంబంధాలను మాటగలుపుతున్నాయి. ప్రియుడు, ప్రియురాలు వ్యామోహంలో పడి.. కట్టుకున్నవారినే కాదు... కన్న తల్లి, తండ్రిని సైతం అంతం చేస్తున్నారు. చివరకు అల్లారుముద్దుగా పెంచుకున్న పిల్లలను కూడా కర్కశంగా చంపేస్తున్నారు.. చిన్నప్పటి నుంచి కలిసి మెలిసి తిరిగిన సోదరుని సైతం కిరాతకంగా ప్రియుడితో కలిసి చంపేసింది.. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న ప్రియురాలి తల్లిని ప్రియుడు అతి కిరాతకంగా చంపేసి బంగారు ఆభరణాలు ఎత్తుకొని పారిపోయాడు..