Betting Apps :బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులన్నింటినీ ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT)కు బదిలీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది. ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు సమాచారం అందిస్తూ, ఇప్పటికే పంజాగుట్ట, మియాపూర్ పోలీస్ స్టేషన్లలో ఈ కేసులు నమోదై ఉన్నాయని స్పష్టం చేశారు. నెలలుగా పెద్ద దందాగా మారిన బెట్టింగ్ యాప్స్ వ్యవహారంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఇందులో భాగంగా, ఇప్పటివరకు వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులన్నింటినీ సమగ్ర దర్యాప్తు కోసం SITకు బదిలీ చేస్తున్నట్లు కోర్టుకు తెలిపింది.
పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో ఇప్పటివరకు 11 మంది ప్రముఖ సెలబ్రిటీలపై కేసులు నమోదయ్యాయి. ఈ ప్రముఖులు బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేయడమే కాకుండా, ప్రజలను ప్రలోభపెట్టి గట్టి ఆర్థిక నష్టాలకు గురిచేశారన్న ఆరోపణలతో ఈ కేసులు నమోదయ్యాయి. మరోవైపు, మియాపూర్ పోలీస్ స్టేషన్లో టాలీవుడ్ అగ్రహీరోలు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ప్రభావశీలులపై కేసులు నమోదయ్యాయి. వీరంతా ఈ యాప్స్‌ను ప్రచారం చేసి ప్రజలకు తప్పుదారి పట్టించారన్న ఆరోపణలపై దర్యాప్తు కొనసాగుతోంది.
ఈ కేసులను SITకు బదిలీ చేయడం ద్వారా మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో కోట్లాది రూపాయలు తిరుగుతున్నట్లు సమాచారం. ఈ కేసులపై సమగ్ర విచారణ అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకునేలా ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. స్తుతం ఈ కేసులపై విచారణ కొనసాగుతోంది. SIT దర్యాప్తు ముగిసిన తర్వాత, దీనికి సంబంధించి మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంపై న్యాయస్థానం ఏ మేరకు స్పందిస్తుందనేది ఆసక్తిగా మారింది.
Bajinder Singh: రేప్ కేసులో దోషిగా తేలిన ‘‘యేషు యేషు’’ పాస్టర్ బజిందర్ సింగ్..