Konda Surekha: తెలంగాణ అసెంబ్లీలో లాబీలో దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ మీడియాతో చిట్ చాట్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. టీటీడీ తరహాలో యాదగిరిగుట్ట బోర్డు ఉండాలని చట్ట సవరణ చేశాం.. టీటీడీకి స్వయం ప్రతిపత్తి ఉంటుంది.. కానీ, యాదగిరిగుట్ట బోర్డుకు ప్రభుత్వం కంట్రోల్ లో ఉంటుంది అని తెలిపారు.
Harish Rao: పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ లాంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికం అని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు.
ఆదర్శదంపతులుగా నిండు నూరేళ్లు కలకాలం జీవించాల్సిన వారు అనుమానాలు, గొడవల కారణంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విడాకులు తీసుకుంటున్నారు. పరాయి వాళ్ల మోజులో పడి ప్రాణాలు కూడా తీస్తున్నారు. దేశ వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు ఎక్కువైపోయాయి. తాజాగా హైదరాబాద్ లో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. అంబర్ పేటలో ఓ భర్త తన భార్యపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఆ తర్వాత ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు ఆ భర్త. తీవ్రగాయాలపాలైన ఆమె చికిత్స పొందుతూ మృతి…
టాలీవుడ్ హీరో విశ్వక్ సేన్ ఇంట్లో ఆదివారం తెల్లవారు జామున భారీ దొంగతనం జరిగింది. హైదరాబాద్ ఫిలింనగర్ రోడ్డు నెంబర్- 8లోని ఇంట్లోకి చొరబడిన ఓ దుండగుడు చేతికందిన సొత్తను తీసుకుని పరారయ్యాడు. తమ ఇంట్లో చోరీ జరిగినట్టు విశ్వక్ సేన్ తండ్రి కరాటే రాజు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు దుండగుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. కాగా విశ్వక్ సేన్ కుటుంబమంతా ఒకే ఇంట్లో ఉంటోంది. విశ్వక్ సేన్ సోదరి…
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లో విద్యార్థుల ఆందోళనలపై నిషేధం విధిస్తూ ఉత్తర్వులు జారీచేయడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిన కాంగ్రెస్ సర్కారు.. ఏడో గ్యారెంటీకి కూడా ఏడాదిన్నరలోనే ఘోరీ కట్టిందని విమర్శించారు.
గచ్చిబౌలిలో దారుణం చోటు చేసుకుంది. ప్రేమ పేరుతో మైనర్ బాలికపై మైనర్ బాలుడు వేధింపులకు పాల్పడ్డాడు. అయితే ఆ ప్రేమను నిరాకరించడంతో.. మార్ఫింగ్ ఫోటోలతో బాలికను వేధించాడు. అంతేకాకుండా.. బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేశాడు. అయితే అత్యాచారానికి పాల్పడిన వీడియోను మరో మైనర్ బాలుడు రికార్డు చేశాడు.
ప్రేమ పేరుతో ఓ యువతిని ప్రేమించాడు. పెళ్లి పేరుతో యువతితో శారీరక సంబంధం కూడా ఏర్పరచుకున్నాడు. తీరా ఆ అమ్మాయిని మోసం చేసి మరో యువతితో పెళ్లికి సిద్ధమయ్యాడు. అయితే ఇంతలో ప్రియురాలు ఓ ట్విస్ట్ ఇచ్చింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించింది.
శంషాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. కౌలంపూర్ నుంచి శంషాబాద్ వస్తున్న ఎయిర్ ఏషియా ఇంటర్నేషనల్ విమానం గాలిలో ఉండగానే విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది.
హైదరాబాద్లోని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) కార్యాలయం ముందు భారీగా పోలీస్ బందోబస్తు నిర్వహించారు. అంతేకాకుండా.. పెద్ద ఎత్తున పోలీసు వాహనాలు మోహరించాయి. గ్రూప్-1, గ్రూప్- 2, గ్రూప్- 3 ఫలితాలు విడుదల అయిన నేపథ్యంలో నిరసనలు జరుగుతాయామోనని ముందస్తుగా పోలీస్ బందోబస్తు ఉన్నారు.
హైదరాబాద్లోని చార్మినార్ భాగ్యలక్ష్మి ఆలయంలో కొత్తగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్సీలు అంజిరెడ్డి, మల్క కొమురయ్య పూజలు చేశారు. వారితో పాటు పూజ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వెంకట రమణ రెడ్డి, పాయల్ శంకర్, మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, బీజేపీ నేతలు పాల్గొన్నారు.