CM Revanth Reddy: హైదరాబాద్ లోని రవీంద్ర భారతిలో తెలంగాణ ప్రభుత్వం ఉగాది వేడుకలు నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు, అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. దేవాదాయ శాఖ, పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఉగాది పంచాంగ శ్రవణం చేపట్టారు.. ఈ కార్యక్రమం నిర్వహించిన అధికారులను అభినందిస్తున్నాం.. పాడి పంటలతో, ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందరికీ వచ్చేలా ఈ కొత్త సంవత్సరం ఉండాలని కోరుకుంటున్నాను.. భట్టి విక్రమార్క ప్రవేశ పెట్టిన బడ్జెట్ కూడా షడ్రుచుల మాదిరి ఉంది.. అందులో పేదలకు విద్య, వైద్యం అందేలా రచించారు.. రైతాంగం అభివృద్ధి చెందేలా బడ్జెట్ ప్రతిపాదన పెట్టారు.. ఇవన్ని జరగాలంటే లా అండ్ ఆర్డర్ సరిగ్గా ఉండాలని సీఎం రేవంత్ పేర్కొన్నారు.
Read Also: CM Chandrababu: ప్రస్తుతం టెక్నాలజీ మీద ప్రపంచం ఆధారపడి ముందుకెళ్తోంది..
అయితే, ఎవరైనా లా అండ్ ఆర్డర్ ను తప్పించేలా పని చేస్తే వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అధికారులను కోరుతున్నాను అని సీఎం రేవంత్ తెలిపారు. ఇక, హైదరాబాద్ కు ప్రపంచ స్థాయిలో గుర్తింపు ఉండాలని మా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది.. అందులో భాగంగా మూసీ ప్రక్షాళన, రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపట్టాం.. దేశానికి ఆదర్శంగా ఉండేలా ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నాం.. అన్ని రకాల బడుగు బలహీన వర్గాలు అభివృద్ధి చెందాలంటే.. అక్కడ పెట్టుబడులు అవసరమని చెప్పుకొచ్చారు. కొన్ని అభివృద్ధి పనులు చేపట్టినప్పుడు కొన్ని అడ్డంకులు రావడం సహజం.. అడ్డంకులు సృష్టించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం.. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నామని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
Read Also: Ugadi Rasi phalalu 2025: ఈ రాశుల వారికి ఈ ఏడాది పట్టిందల్లా బంగారమే..
ఇక, ఒకప్పుడు పండగ రోజు మాత్రమే తెల్ల అన్నం తినే వారు.. ఎన్టీఆర్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ తెల్లన్నం తినేలా రేషన్ బియ్యం అందించారని ముఖ్యమంత్రి రేవంత్ చెప్పుకొచ్చారు. ఇప్పుడు మా ప్రభుత్వం దొడ్డు బియ్యం కాకుండా సన్నం బియ్యం తినేలా చేయాలని.. రేషన్ పై సన్న బియ్యం పంపిణీ చేయాలని నిర్ణయం తీసుకున్నాం.. రైతులు కూడా ఎక్కువగా సన్న బియ్యం పండించాలని కోరుతున్నాం.. ఆ విషయంలో వారికి ఎంకరేజ్ చేసేందుకు సన్న బియ్యం పండించే వారికి బోనస్ కూడా అందిస్తున్నామని వెల్లడించారు. తెలంగాణను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా నిలబెట్టాలనే సంకల్పం మాది.. దేశానికే తెలంగాణ ఆదర్శంగా ఉండాలనే సంకల్పంతో పని చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు.