విజన్ ఉన్న నేత రాహుల్ గాంధీ.. దేశం కోసం ఆయన ఏఐసీసీ పగ్గాలు చేపట్టాలని కోరారు సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క.. గాంధీభవన్‌లో జరిగిన రాహుల్ గాంధీ జన్మదిన వేడుకల్లో పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పాల్గొన్న ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అన్ని వ్యవస్థలను మోడీ సర్కార్ కూల్చి వేస్తోందని మండిపడ్డారు.. మాటలతో బతికే ప్రధాని మోడీ అని దుయ్యబట్టిన ఆయన.. యువత ఉద్యోగాలు లేక నిరాశతో ఉందన్నారు.. ఆస్తులు అన్నీ అమ్మకానికి పెట్టారు మోడీ అని ఆరోపించిన ఆయన.. ప్రజల ఆరోగ్యం తో చెలగాటం అడారు… వేల మంది చావులకు కారణం అయ్యారని ఫైర్ అయ్యారు.. ఈ సమయంలో.,. విజన్ ఉన్న నాయకుడు రాహుల్ గాంధీ.. దేశం కోసం.. ఏఐసీసీ ప్రెసిడెంట్ పదవి స్వీకరించాలని కోరారు.. పార్టీ పగ్గాలు చేపట్టి… విచ్చిన మైన వ్యవస్థలను కాపాడాలని కోరిన భట్టి.. దేశ వ్యాప్తంగా పాదయాత్రలు చేసి ప్రజలకు ధైర్యం ఇవ్వాలన్నారు.. ఈ విషయంపై త్వరలోనే రాహుల్ కి లేఖ రాస్తానని తెలిపారు.