కరోనా మహమ్మారి విజృంభణ.. మరోవైపు లాక్‌డౌన్‌లతో ప్రయాణికులు చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి.. ఇక, దూర ప్రాంతాలకు వెళ్లే వారి పరిస్థితి దారుణంగా తయారైపోయింది. రెగ్యులర్ సర్వీసులు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చిన పరిస్థితి లేదు.. ఇక, ఇదే సమయంలో.. దక్షిణ మధ్య రైల్వే పలు రైళ్లను రద్దు చేసింది.. ఈ నెల 21 తేదీ నుంచి జులై 1వ తేదీ వరకు ఈ రైళ్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది సౌత్ సెంట్రల్ రైల్వే.. ఈ నెల 21వ తేదీ నుంచి 30 వరకు విశాఖపట్నం-కాచిగూడ (08561), విశాఖపట్నం-కడప (07488), విశాఖపట్నం-లింగంపల్లి (02831) రైళ్లను రద్దు చేసిన ఎస్‌సీఆర్.. ఈ నెల 22 నుంచి జులై 1 వరకు కాచిగూడ-విశాఖపట్నం (08562), కడప-విశాఖపట్నం (07487), లింగంపల్లి-విశాఖపట్నం (02832) రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్టు తన ప్రకటనలో పేర్కొంది.