కరోనా కట్టడి కోసం విధించిన లాక్‌డౌన్ ను పూర్తిగా ఎత్తివేసింది తెలంగాణ ప్రభుత్వం.. ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.. రాష్ట్రంలో కరోనా కేసులు, వ్యాక్సినేషన్, థర్డ్ వేవ్, తదితర అంశాలపై చర్చించిన కేబినెట్.. లాక్‌డౌన్‌ను ఎత్తివేయాలని నిర్ణయానికి వచ్చింది.. కరోనా పూర్తిగా నియంత్రణలోకి వచ్చినట్టు కేబినెట్ పేర్కొంది.. అన్ని రకాల నిబంధనలు పూర్తిగా ఎత్తివేసింది.. కరోనా కేసులు, పాజిటివిటీ రేటు గణనీయంగా తగ్గిందని.. వైద్యారోగ్యశాఖ నివేదిక పరిశీలించిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు కేబినెట్ పేర్కొంది. లాక్ డౌన్ సందర్భంగా విధించిన అన్ని రకాల నిబంధనలను పూర్తిస్థాయిలో ఎత్తివేయాలని అన్ని శాఖల అధికారులను ఆదేశించింది తెలంగాణ కేబినెట్.. లాక్‌డౌన్‌తో మూతపడిన అన్నిసాధారణంగా పనిచేయనున్నాయి.. పబ్‌లు, క్లబ్‌లు, థియేటర్లు.. ఇలా అన్నీ అందుబాటులోకి రానున్నాయి.. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కాసేపట్లో వెలువడే అవకాశం ఉంది.. ప్రభుత్వం నిర్ణయం రేపటి నుంచి అమల్లోకి రానుంది.