కరోనా పరిస్థితుల నేపథ్యంలో.. ఇప్పుడు సమావేశాలు అన్నీ జూమ్‌కు పరిమితం అయ్యాయి.. ఇక, ఇవాళ డీసీసీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులతో జూమ్ లో సమావేశం నిర్వహించారు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.. కరోనా కట్టడి విషయంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపిస్తూ వస్తున్న కాంగ్రెస్.. దీనిపై రేపు గవర్నర్ తమిళిసై ను కలిసి.. వినతి పత్రం సమర్పించాలని నిర్ణయించారు.. జిల్లా కేంద్రాలలో డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రతినిధి బృందం కలెక్టర్లను కలిసి వినతిపత్రం…
దేశంలో పుత్తడికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. ఇక పెళ్లిళ్ల సీజన్లో పుత్తడిని కొనుగోలు చేసేవారి సంఖ్య అధికం. కరోనా కారణంగా వివాహాలు పెద్దగా హడావుడి లేకుండా సింపుల్‌గా జరుగుతున్నాయి. భారీగా వివాహాం చేసుకోవాలి అనుకునేవారు వాయిదా వేసుకుంటున్నారు. కరోనా ప్రభావం బంగారం ధరలపై స్పష్టంగా కనిపిస్తున్నది. గత కొన్ని రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. బంగారం ధర ఇప్పటికే రూ.50 వేలు దాటింది. ఇక ఇదిలా ఉంటే, ఈరోజు బులియన్ మార్కెట్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. 10…
తెలంగాణ రాష్ట్రం ఇవాళ అవతరణ దినోత్సవాన్ని జరుపుకుంటుంది.. కరోనా సమయంలో.. ఎలాంటి హడావుడి లేకుండా కార్యక్రమాలు నిర్వహించారు.. ఉదయం అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. ఆ తర్వాత రాజ్‌భవన్‌కు వెళ్లి.. గవర్నర్ తమిళిసైని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా గవర్నర్‌కు రాష్ర్ట ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ఇవాళ గవర్నర్ పుట్టిన రోజు కూడా కావడంతో ఆమెకు బొకేను అందించిన విషెష్ చెప్పారు.. ఆమె ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆకాంక్షించారు. తాజా పరిస్థితులపై…
2014 జూన్ 2 వ తేదీన ప్రత్యేక తెలంగాణ ఆవిర్భవించింది. తెలంగాణ కోసం ఎందరో పోరాటం చేశారు. ఎందరో ప్రాణ త్యాగం చేశారు. నీళ్లు, నిధులు, నియామకాల నినాదాలతో తెలంగాణ పోరాటం జరిగింది. తెలంగాణ సాధన తరువాత మొదటి ముఖ్యమంత్రిగా కేసీఆర్ బాధ్యతలు చేపట్టారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగుతున్నది. 2018 వ సంవత్సరంలో రెండోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తరువాత మరింత అభివృద్ధి దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నది. 1969 లో తెలంగాణకోసం ఉమ్మడి…
ప్రేమించిన అమ్మాయి కోసం తెలుగు యువకుడు దేశాలు దాటి వెళ్లేందుకు కాలి నడకన బయలుదేరి దాయాది దేశం సైనికులకు దొరికిపోయాడు. 2017 నుంచి పాక్ చెరలో ఉన్న తెలుగు యువకుడు ప్రశాంత్ ఇటీవల రిలీజ్ అయ్యి హైదరాబాద్ చేరుకున్నాడు. పాక్ చెర నుంచి క్షేమంగా బయటపడిన ప్రశాంత్ పాక్ జైలు గురించి కీలక విషయాలను తెలియజేశాడు. విచారణ సమయంలో తనను తీవ్రంగా కొట్టారని, ఏడారి ప్రాంతంలో సైనికులకు దొరికిన సమయంలో తనకు మంచి ఆహారం అందించారని ప్రశాంత్…
మూడు రోజుల క్రితం వరకూ తగ్గుతూ వచ్చిన బంగారం ధరలు ఇప్పుడు తిరిగి పెరగడం మొదలు పెట్టాయి. మూడు రోజులుగా ధరలు పెరుగుతున్నాయి. మూడో రోజు కూడా ధరలు భారీగా పెరిగాయి. హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఈ విధంగా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 200 పెరిగి రూ.46,100కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.230 పెరిగి 50,300 కి చేరింది. గత మూడు రోజులుగా…
ఈ రోజు తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను నిరాఢంబరంగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కరోనా మహమ్మారి కారణంగా వేడుకలను సాదాసీదాగా నిర్వహించబోతున్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో లాక్ డౌన్ అమలు జరుగుతున్నది. మధ్యాహ్నం ఒంటిగంట తరువాత బయటకు ఎవరూ రాకూడదు అనే సంగతి తెలిసిందే. దీంతో ఉదయం సమయంలోనే వేడుకలను సాదాసీదాగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఎక్కడ వేడుకలు జరిగినా 10 మందికి మించకుండా ఉండాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. గతేడాది కూడా కరోనా…
తెలంగాణ ప్రభుత్వంపై మరోసారి హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.. పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ ఇచ్చిన నివేదికపై న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది.. తాము ఇచ్చిన ఆదేశాలు పాటించలేదన్న కోర్టు.. కోవిడ్ చికిత్సల ధరలపై కొత్త జీవో ఇవ్వలేదని మండిపడింది.. తాము అడిగిన ఏ ఒక్క అంశానికి నివేదికలో సరైన సమాధానంలేదని వ్యాఖ్యానించింది.. ఇక, రేపు జరిగే విచారణకు.. హెల్త్ సెక్రటరీ, పబ్లిక్ హెల్త్ డైరెక్టర్, డీజీపీ.. అందరూ హాజరుకావాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది.. మహారాష్ట్రలో 8 వేల…
ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే భారత ప్రభుత్వం రష్యాకు చెందిన స్పుత్నిక్ వ్యాక్సిన్ కు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక తాజాగా హైదరాబాద్- శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు స్పుత్నిక్ వ్యాక్సిన్ చేరుకుంది. రష్యా నుండి ప్రత్యేక విమానంలో వచ్చిన 56.6 టన్నుల స్పుత్నిక్ వ్యాక్సిన్ ను శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కార్గో లో దిగుమతి అయింది. వ్యాక్సిన్ రష్యా నుండి ప్రత్యేక ఛార్టర్డ్ ఫైట్ ( RU-9459) లో హైదరాబాద్…