హైదరాబాద్‌లో నర్సు నిర్లక్ష్యం.. ఫోన్ మాట్లాడుతూ యువతికి 2 డోసుల వ్యాక్సిన్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కరోనా వైరస్‌కు చెక్ పెట్టేందుకు ఇప్పుడున్న ఏకైక మార్గం వ్యాక్సినేషన్.. క్రమంగా వ్యాక్సిన్ వేసుకోవడానికి మొగ్గు చూపుతున్నా.. కొన్ని భయాలు వారిని వెంటాడుతూనే ఉన్నాయి.. అయితే, అక్కడక్కడ నర్సులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కనిపిస్తోంది. హైదరాబాద్ శివారులో విధుల్లో ఉన్న నర్సు ఫోన్ మాట్లాడుతూ.. ఓ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసింది.. కాసేపటికి కళ్లు తిరిగిపడిపోయిన ఆ యువతిని హుటాహుటిన ఆస్పత్రిలో చేర్చాల్సిన పరిస్థితి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే.. అబ్దుల్లాపూర్ మెట్ జెడ్పీహెచ్ వ్యాక్సినేషన్ సెంటర్ ఓ యువతి వ్యాక్సిన్ వేయించుకోవడానికి వెళ్లింది.. అక్కడ విధుల్లో ఉన్న నర్సు.. ఫోన్ మాట్లాడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించింది. ఆ యువతికి ఒకేసారి రెండు డోసుల వ్యాక్సిన్ వేసేసింది.. ఇక, వ్యాక్సిన్ తీసుకున్న కాసేపటికే సదరు యువతి కళ్లు తిరిగి పడిపోగా.. వెంటనే ఆమెను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు.. ఆస్పత్రిలో యువతిని అబ్జర్వేషన్ లో పెట్టిన వైద్యులు.. ప్రస్తుతం ఆమె పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు.
Also Read
తాజావార్తలు
-
Kona Venkat: ‘కామ్రేడ్ కల్యాణ్’కు 3.5 రేటింగ్స్.. కోన వెంకట్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
Minister Nara Lokesh: బీసీ రిజర్వేషన్లపై లోకేష్ కీలక వ్యాఖ్యలు.. అక్టోబర్ లోనే ఎన్నికలు..?
-
India Mobile Congress 2026: సైబర్ మోసాల నివారణకు గ్లోబల్ ఫ్రేమ్‌వర్క్.. ప్రధాని మోడీ కీలక పిలుపు
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
ట్రెండింగ్
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!
-
Veg Omelette: గుడ్డు లేకుండానే గుమగుమలాడే “వెజ్ ఆమ్లెట్”.. ఒక్కసారి తింటే మళ్లీ మళ్లీ చేసుకుంటారు.!
-
Eggshell: గుడ్డు పెంకులను పడేస్తున్నారా? అయితే మీరు ఎగ్ కర్రీలో కాలేసినట్లే..! వీటిని ఇలా కూడా ఉపయోగించవచ్చని తెలుసా.?