కేసీఆర్‌పై బీజేపీ నేత మోత్కుపల్లి ప్రశంసలు.. మీపై విశ్వాసం పెరిగింది..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీఎం కేసీఆర్ నిర్వహించిన అఖిలపక్ష సమావేశాన్ని బీజేపీ బహిష్కరించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు మాత్రం హాజరుకావడం ఆస్తికరంగా మారింది.. అంతే కాదు.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించిన మోత్కుపల్లి.. ఆయనకు అభినందనలు తెలిపారు.. మరియమ్మ లాకప్ డెత్ విషయంలో మీరు తీసుకున్న రక్షణ చర్యలు దళిత వర్గాల్లో చర్చనీయాంశమైంది.. దళితుల్లో మీ మీద విశ్వాసం పెరిగిందని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు మోత్కుపల్లి.. ప్రజల హృదయాల్లో శాశ్వతంగా ఉండే అవకాశాన్ని ఈ సమావేశం నిర్వహించడం ద్వారా మీరు సద్వినియోగం చేసుకోవడం సంతోషంగా ఉందన్న ఆయన.. ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి.. దళితుల అభివృద్ధికి ఏమి చేయాలని.. మమ్మల్ని అందరినీ పిలిచి సలహాలు తీసుకోవడం.. దళిత సమాజంలో మానసిక ఉత్తేజం కలిగించింది.. అందరకు మీకు ధన్యవాదులు అని తెలిపారు.
తెలంగాణ వచ్చిన తర్వాత వివిధ సందర్భాల్లో అన్యాయాలకు గురైన దళిత కుటుంబాలను గుర్తించి, ఆదుకొని వారికి రక్షణ చర్యలు ప్రకటించాలని ఈ సందర్భంగా కేసీఆర్‌ను కోరారు మోత్కుపల్లి.. దళిత సాధికారతలో భాగంగా దళారులు లేకుండా నేరుగా దళితులకు ఆర్థికసాయం అందిస్తెనే మేలు జరుగుతుందన్న ఆయన.. రైతుబంధు పథకం లాగా నేరుగా ఆర్థిక సహాయం అందిస్తే దళితులు సంతోషిస్తారిన తెలిపారు.. దళితుల కోసం ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేయడాన్ని హృదయపూర్వకంగా అభినందించిన మోత్కుపల్లి నర్సింహులు… ఇక, యాదగిరిగుట్టను, ప్రపంచం గుర్తించే రీతిలో తీర్చిదిద్దుతున్నందుకు, అక్కడి నుంచి ఐదు సార్లు గెలిచిన ప్రజాప్రతినిధిగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు వెల్లడించారు.. గురుకుల పాఠశాలలు వచ్చిన తర్వాత దళిత విద్యార్థులు.. కలెక్టర్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలు చేయాలనే, వారి ఆకాంక్షలు నెరవేరుతుండటం ఆనందదాయకం అన్నారు.. ఎస్సీల అభివృద్ది గురించి ఇంతగా తపించే మీకు భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు మోత్కుపల్లి. కాగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి వెళ్లాల్సింది కాదని.. పార్టీ తీసుకున్న నిర్ణయం ఆయనకు తెలుసు.. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా లేదని ఆ పార్టీ నేత, మాజీ ఎంపీ వివేక్ వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. మొత్తంగా.. ఈ సమావేశానికి మోత్కుపల్లి హాజరు కావడం.. సీఎం కేసీఆర్‌పై ప్రశంసలు కురిపించడం ఆస్తికరంగా మారింది.
Also Read
- China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
- Saudi-Trump: హౌతీలపై దాడులు చేయాలని ట్రంప్‌కు సౌదీ విజ్ఞప్తి.. అధ్యక్షుడు షాకింగ్ రియాక్షన్
- Gyanesh Kumar: ‘సర్’ ఫిర్యాదులు వచ్చే ఎన్నికల నాటికి పరిష్కరిస్తాం.. సీఈసీ కీలక వ్యాఖ్యలు
- Maharashtra: నాందేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కు-టాటా మ్యాజిక్ ఢీ.. 9 మంది మృతి
తాజావార్తలు
-
China: బ్రిక్స్ సదస్సు భారత్ విజయవంతంగా నిర్వహించాలి.. మోడీ-జిన్‌పింగ్ భేటీకి ముందు చైనా కీలక వ్యాఖ్యలు
-
BRICS Summit: పుతిన్, జిన్‌పింగ్ ఎక్కడ బస చేస్తున్నారు? ఢిల్లీలో స్టార్ హోటళ్లన్నీ హైసెక్యూరిటీ జోన్లే!
-
Nethanna Bharosa: పెన్షన్లకు దరఖాస్తు చేసుకునే వారికి శుభవార్త.. దరఖాస్తులో ఆ నిబంధన మినహాయింపు..
-
Harish Rao : కేసీఆర్ పాలనలో పరిష్కారాలు.. రేవంత్ సర్కార్‌లో సమస్యలే
-
Smart Watches: AMOLED డిస్‌ప్లే, రఫ్ అండ్ టఫ్ లుక్.. తక్కువ ధరల్లో స్మార్ట్‌వాచ్‌లు అందుబాటులోకి..
ట్రెండింగ్
-
Railways Child Ticket Rules: పిల్లలతో రైలు ప్రయాణమా.? వారికి టికెట్ తీసుకోవాలా లేదా.? రైల్వే రూల్స్ ఏమి చెబుతున్నాయంటే..
-
Vaibhav Sooryavanshi: వైభవ్ తక్కువోడు కాదయ్యో.. ప్రత్యర్థి కెప్టెన్‌నే స్లెడ్జ్ చేశాడు.. వీడియో వైరల్!
-
IP64 రేటింగ్, 7,000mAh బ్యాటరీతో సెప్టెంబర్ 16న రానున్న OPPO K14 Lite..!
-
iPhone 18 Proపై వేల రూపాయలు ఆదా.. అక్కడ కొంటే భారీగా డబ్బులు మిగలనున్నాయా.?
-
80s Photo Trend: నిపుణుల హెచ్చరిక.. మీరు ఇచ్చిన పర్సనల్ ఫొటోలను చాట్‌జీపీటీ ఎలా వాడుకుటుందో తెలుసా?