సీఎం దళిత్ ఎంపవర్‌మెంట్ పథకానికి సంబంధించి ప్రగతిభవన్ అఖిలపక్ష సమావేశం జరుగుతోంది.. సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరుగుతోన్న ఈ సమావేశానికి అన్ని పార్టీల నేతలు హాజరయ్యారు.. అయితే, ఈ సమావేశాన్ని బహిష్కరిస్తున్నాట్టు బీజేపీ ప్రకటించినా.. ఆ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు హాజరు కావడం పెద్ద చర్చగా మారింది.. దీనిపై బీజేపీ నేత, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి స్పందించారు.. బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పార్టీ నిర్ణయంపై మోత్కుపలి కి సమాచారం ఉందన్నారు.. కమ్యూనికేషన్ గ్యాప్ కూడా ఏమీ లేదని.. కానీ, సీఎం కేసీఆర్ సమావేశానికి ఆయన పోకుండా ఉండాల్సిందని అభిప్రాయపడ్డారు.. అయితే, అఖిలపక్షానికి వెళ్లిన మోత్కుపల్లి.. దళితులకు కేసీఆర్ చేసిన అన్యాయం గురించి ప్రశ్నిస్తే బాగుంటుందని సూచించారు.. దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తా అని చెప్పి ఎందుకు చేయలేదు అని అడగాలన్న వివేక్.. దళితులకు మూడు ఎకరాల భూమి ఎందుకు ఇవ్వలేదో ప్రశ్నించాలని కూడా సూచించారు. మరి మోత్కుపల్లి వర్షన్ ఎలా ఉంది తెలియాల్సి ఉంది.