ప్రస్తుతం యువత విదేశీ సంప్రదాయాలను ఎక్కువగా ఫాలో అవుతున్నారు.. పబ్ ల, క్లబ్ లు, డేటింగ్ లు ఇలా విదేశీ కల్చర్ ని పాటిస్తూ భారత సంప్రదాలను మరుస్తున్నారు. తాజాగా ఒక మహిళ పబ్ మోజులో పడి ఎంతో పవిత్రంగా చూసుకొనే మంగళ సూత్రాన్ని తీసేసింది. ఆ తరువాత అనుకోని చిక్కు వచ్చిపడింది. సరదాగా పబ్ కి వెళితే.. విలువైన మంగళ సూత్రం, నగదు పోగొట్టుకొని బయటికి వచ్చింది. ఈ ఘటన హైదరాబాద్ కెమిస్ట్రీ పబ్ లో వెలుగుచూసింది.
వివరాలలోకి వెళితే.. బోయిన్‌పల్లికి చెందిన జిఆర్ రామచందర్ అనే వ్యక్తి తన భార్య మీనాక్షితో కలిసి జూబ్లీహిల్స్ లోని కెమిస్ట్రీ పబ్ కి వెళ్లాడు. పబ్ లోకి వెళ్లేటప్పుడు మెడలో తాళి ఎందుకు అని మీనాక్షి తన తాళిని తీసి పర్సులో పెట్టింది. కారు పార్కింగ్ కోసం నవీన్ అనే వ్యక్తికి తాళాలు ఇచ్చి వారు పబ్ లోపలి వెళ్లారు. అనంతరం పార్టీ ముగించుకొని బయటికి వచ్చి కారులో చూడగా మీనాక్షి పర్స్ అయితే ఉంది కానీ అందులో ఉన్న బంగారు తాళి, నగదు కనిపించలేదు. దీంతో తమ కారులో దొంగతనం జరిగిందని గుర్తించిన దంపతులు శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.