హైదరాబాద్‌లోని కుషాయిగూడ లో దారుణం చోటు చేసుకుంది. లవర్ కోసం ఏకంగా కన్న తండ్రిని సూపరీ ఇచ్చి చoపించింది ఓ మైనర్ బాలిక. ఈ సంఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఈ ఘటన వివరాల్లోకి వెళితే…. కుషాయిగూడలో నివాసం ఉంటున్న రామకృష్ణ కూతురు…. ఓ వ్యక్తిని ప్రేమించింది. అయితే.. ఆ ప్రేమ తండ్రి రామృకృష్ణ నిరాకరించాడు. దీంతో ఆవేశానికి గురైన అతని కూతురు… తండ్రినే చంపేందుకు ప్లాన్ వేసింది. ఇందులో భాగంగానే..రామకృష్ణకు మత్తు మందు ఇచ్చి చంపింది కూతురు.
తండ్రి తినే కోడి కూర లో మత్తు మందు కలిపి సృహ కోల్పోయేలా చేసిన బాలిక…. తండ్రి రామకృష్ణ సృహా కోల్పోయిన తర్వాత ప్రియుడిని పిలిచి చంపించింది. అంతేకాదు…. తండ్రిని చంపించేందుకు ప్రియుడితో కలిసి సుపారి గాంగ్ ను ఎంగేజ్ చేసింది ఆ బాలిక. ఇందులో భాగంగానే.. సుపారీ గ్యాంగ్, ప్రియుడు, బాలిక కలిసి రామకృష్ణను హత్య చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో రామకృష్ణ హత్య కేసును ఛేదించారు కుషాయిగూడ పోలీసులు. దీంతో మైనర్ బాలిక తో పాటు నలుగురిని అరెస్టు చేశారు కుషాయిగూడ పోలీసులు. ఈ ఘటన గురించి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.