నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి ఆదిత్యానాథ్.. యూపీ సీఎంగా రెండోసారి యోగికి బాధ్యతలు, సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎంగా యోగి ప్రమాణం, హాజరుకానున్న ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు..
నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన.
తూర్పుగోదావరి జిల్లా: నేడు జాతీయ సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా అమలాపురంలో శోభాయాత్ర
అనంతపురం కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి తీర్థవాది (స్వామివారి చక్రస్నానం).
విశాఖ: నేడు, రేపు యశ్వంత్ పూర్-పురీ మధ్య నడిచే గరీబీ రధ్ రైళ్లు రద్దు… ఈనెల 28వరకు భువనేశ్వర్-బెంగుళూరు మధ్య ప్రశాంతి ఎక్స్ ప్రెస్ రాకపోకలు కుదింపు… పెనుకొండ సెక్షన్లో మరమ్మత్తులు కారణంగా మార్పులు చేసినట్టు వాల్తేర్ డివిజన్ ప్రకటన.