Kukatpally Rythubazar: మోడల్ రైతు బజార్ ప్రారంభించిన హరీష్ రావు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
శరవేగంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిత్యం రద్దీగా వుండే కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో మొదటగా ఎర్రగడ్డలో మోడల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయగా, కూకట్‌పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో రెండో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఇక్కడ కూరగాయలు లభిస్తాయి.
కూకట్‌పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ) రైతుబజార్ పున:నిర్మాణ పనులకు 2018 జూలై లో మంత్రి హరీశ్‌రావు శిలాఫలకం వేశారు. సుమారు రూ.15 కోట్లతో సెల్లార్ ప్లస్, జీ ప్లస్ 1 భవనంలో సకల సౌకర్యాలు ఉండేలా రైతుబజార్‌ను నిర్మించారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో రైతులకు 158 స్టాళ్లు, స్వయం సహాయక సంఘాలకు 65 స్టాళ్లు, 18 దుకాణాలు ఉన్నాయి. మొదటి అంతస్తులో రైతులకు 148, స్వయం సహాయక సంఘాలకు 77 స్టాళ్లతో పాటు 5 దుకాణాలు ఉన్నాయి. రైతుబజార్‌లో 471 స్టాళ్లతో పాటు సౌకర్యాలు అందుబాటులోకి వచ్చాయి. ఈ రైతుబజార్ నిర్మాణానికి సహకరించిన సీఎం కేసీఆర్, మంత్రులందరికీ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, కార్పొరేటర్ మందడి శ్రీనివాస్‌రావు కృతజ్ఞతలు తెలిపారు.
Also Read
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్‌పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!