తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. 3000 ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చాయి ప్రైవేట్ కంపెనీలు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు నిరుద్యోగులు.
జాబ్ మేళాలు నిరుద్యోగులకూ ఎంతో ఉపయోగపడతాయన్నారు సీవీ ఆనంద్. కోవిడ్ వచ్చాక ఫిజికల్ వర్క్ అలవాటు తగ్గింది. ఉద్యోగాలు లక్షల్లో ఉంటే, జనాభా కోట్లల్లో ఉంది.అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే అసాధ్యం… ప్రైవేట్ లో ఎన్నో అవకాశాలు ఉన్నాయన్నారు. రాబోయే పోలీస్ నోటిఫికేషన్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తున్నాం. నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
గ్రౌండ్ కోచింగ్, ఫిజికల్, క్లాస్ రూమ్ కోచింగ్ ఇస్తాం. హైదరాబాద్ పరిధిలో పోలీస్ ఉద్యోగాలకు తక్కువ సంఖ్యలో అప్లికేషన్స్ వస్తాయి. చాలా మంది ఇంట్రెస్ట్ చూపించరు. ప్రతిసారి పోస్టులు మిగులుతాయి. ఈసారి అలా జరగకుండా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాం… నిరుద్యోగులు, ఇంట్రెస్ట్ ఉన్నవారు ఫ్రీ కోచింగ్ కూ అప్లై చేసుకోవాలన్నారు. ఉద్యోగాల కల్పన వల్ల క్రైమ్ రేట్ తగ్గుతుందన్నారు సీవీ ఆనంద్.
స్కిల్స్ ఉన్నవారికి ప్రైవేట్ సెక్టర్ లో చాలా అవకాశాలు ఉన్నాయి. ప్రభుత్వ ఉద్యోగాలు కూడా రావడానికి సిద్ధంగా ఉన్నాయి. సీఎం కేసీఆర్ ఇటీవలే ప్రకటన చేసారు. ప్రభుత్వ ఉద్యోగానికి చాలా ఓపిక ఇంట్రెస్ట్ కావాలన్నారు సీవీ ఆనంద్.