పుస్తకాలు చదవడం అంటే నాకెంతో ఇష్టం. కోటి రూపాయలను ఇవ్వమంటే ఇస్తా. ఒక సినిమా ఫ్రీగా చేయమంటే చేసేస్తానేమో కానీ.. ఒక బుక్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేం. లైబ్రరీకి వెళితే పుస్తకాలన్నీ చదివేయాలని అత్యాశ వుంటుంది. మనం సంపాదించుకున్న నాలెడ్జ్ అలాగే మనదగ్గర వుంది. విలువలు పాటించే జర్నలిస్టులంటే నాకెంతో అభిమానం. ఎంవీఆర్ శాస్త్రి లాంటి వారు రాసిన బుక్స్ అంటే చాలా ఇష్టం. కనీసం 100 రూపాయల నోటు మీద అయిన నేతాజీ బొమ్మ ఉండాలి.
పాస్ పోర్ట్ ఆఫీస్ రాజశేఖర్ నన్ను టోక్యోలోని నేతాజీ అస్థికలు ఉన్న గుడిలోకి తీసుకెళ్లారు. డీఎన్ఏ టెస్టులు వచ్చాక కూడ నేతాజీ అస్థికలు ఎందుకు తీసుకురావడం లేదు అన్న బాధ వుంది. మూడు కమిషన్లు వేసినా తీసుకురాలేదు నేతాజీ అస్థికలు..పీవీ నరసింహారావు తీసుకొందాము అనుకున్న కుదరలేదు..
మనం నేతాజీ అస్థికలు తీసుకురావాలని కోరుకోవాలి. నేతాజీని మనం గౌరవించుకోకపోతే మనం భారతీయులం కాదు. టోక్యోలోని రెంకోజీ టెంపుల్ లో నేతాజీ అస్థికలు దిక్కులేకుండా ఉన్నాయి. నేనూ సగటు మనిషినే..అందుకే మేధావులని కలవాలంటే భయం. నేను ఎప్పుడు డబ్బుల వెంట పడలేదు. నేను సినిమా హీరో అవాలని కోరుకున్న జీవితం కాదు. ఎంవిఆర్ శాస్త్రిగారు రాసే పుస్తకాలు మనకు దివ్య ఔషథం లాంటివన్నారు పవన్ కళ్యాణ్.