ఈమధ్యకాలంలో సెల్ ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. దానికి తగ్గట్టుగా ప్రమాదాలు కూడా పెరిగాయనే చెప్పాలి. ఫోన్లకు చార్జింగ్ పెట్టి మాట్లాడడం ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నా నిర్లక్ష్యంగానే వుంటున్నారు చాలామంది యువత. సెల్ ఫోన్ ఛార్జింగ్ లో వుండగానే మాట్లాడుతూ ప్రమాదాల బారిన పడుతున్నారు. ఒక్కోసారి ప్రాణాలు కోల్పోతున్నారు. హైదరాబాద్ శివారులోని శంకరపల్లిలో ఓ యువకుడు మరణించిన సంఘటన విషాదాన్ని నింపింది.
అసోంకు చెందిన 20 ఏళ్ళ భాస్కర్ జ్యోతినాథ్ రెండేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చి ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తూ శంకర్‌పల్లిలో ఉంటున్నాడు. ఈ క్రమంలో సోమవారం రాత్రి విధుల నుంచి వచ్చిన తర్వాత ఫోన్ కి ఛార్జింగ్ లేదు. అర్ధరాత్రి వేళ ఫోన్‌కు చార్జింగ్ పెట్టాడు జ్యోతినాథ్. అలాగే ఫోన్ మాట్లాడుతుండగా ఒక్కసారిగా షాక్ కొట్టింది. దీంతో చేతులు, చెవులు కాలిపోయాయి. వెంటనే స్నేహితులు అతడిని శంకర్‌ప్లలిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అయితే, అప్పటికే అతడు మృతి చెందాడని వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫోన్ ఛార్జింగ్ లో వుండగా షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా వుంటాయి.