హైదరాబాద్ లో దొంగలు రెచ్చిపోతున్నారు. అర్దరాత్రి రెండు ఏటీఎంలలో చోరీకి విఫలయత్నం చేశారు. పోలీసులు అప్రమత్తం కావడంతో దొంగలు పారిపోయారు. మాదన్నపేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో అర్దరాత్రి ఎస్ బి ఐ బ్యాంక్ ఏ టీ ఎంతో పాటు యాక్సిస్ బ్యాంక్ ఏటీఎంలలో చోరికి ప్రయత్నించారు దొంగలు. దోబీఘాట్ లోని జయ్ హింద్ హోటల్ సమీపంలో ఉన్న రెండు ఏటీఎంలలోకి ప్రవేశించారు ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు. అర్దరాత్రి ఏటీఎం సెంటర్ లోకి ప్రవేశించి చోరీకి ప్రయత్నించారు.…
హైదరాబాద్‌లో వింగ్స్ ఇండియా ఏవీయేషన్ షో (Wings India Aviation Show) అట్టర్ ఫ్లాప్ అయ్యింది. వివిధ సంస్థల ఉత్పత్తుల ప్రదర్శన దగ్గర నుంచి ఏర్పాట్లు వరకూ అన్ని ఫెయిలయ్యాయి. దీంతో ఈ ప్రదర్శనకు విచ్చేసిన సందర్శకులు పెద విరుస్తున్నారు. అంతర్జాతీయ స్థాయి వింగ్స్ ఇండియా 2022కు హైదరాబాద్ బేగంపేట విమానాశ్రయం వేదికయ్యింది. ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగంలో గల అనేక సంస్థలు తమ ఉత్పత్తుల్ని ఇక్కడ ప్రదర్శించాయి. దేశ, విదేశాలకు చెందిన విమానాలు, హెలికాప్టర్లు, డ్రోన్లు…
హైదరాబాద్ నగరంలో వాహనం లేని వారు ఎక్కువగా క్యాబ్‌లను ఆశ్రయిస్తుంటారు. వీరిలో చాలా మంది ఉబర్, ఓలా క్యాబ్‌లను బుక్ చేస్తుంటారు. అలాంటి వారికి తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్ చేదువార్తను అందించింది. ప్రస్తుతం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరల కారణంగా త్వరలో క్యాబ్ ఛార్జీలు పెరగనున్నట్లు తెలుస్తోంది. ఇంధన ధరల కారణంగా ఈనెల 29 నుంచి ఓలా, ఉబర్ క్యాబ్‌లలో ఏసీలను బంద్ చేస్తున్నట్లు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్‌ఫాం వర్కర్స్ యూనియన్…
శరవేగంగా అభివృద్ధిచెందుతున్న హైదరాబాద్‌లో తెలంగాణ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతోంది. నిత్యం రద్దీగా వుండే కేపీహెచ్‌బీ కాలనీలో మోడల్ రైతుబజార్ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ కార్యక్రమంలో మంత్రులు నిరంజన్‌రెడ్డి, హరీశ్‌రావు, మల్లారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత హైదరాబాద్‌లో మొదటగా ఎర్రగడ్డలో మోడల్ రైతుబజార్‌ను ఏర్పాటు చేయగా, కూకట్పల్లి కేపీహెచ్‌బీ కాలనీలో రెండో రైతుబజార్‌ను ఏర్పాటు చేశారు. వినియోగదారులకు అతి తక్కువ ధరకు ఇక్కడ కూరగాయలు లభిస్తాయి. కూకట్పల్లి (కేపీహెచ్‌బీ కాలనీ) రైతుబజార్…
తెలంగాణలో యువత ఉద్యోగాల కోసం ఎదురుచూస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ యూసఫ్ గూడా కోట్ల విజయ భాస్కర్ రెడ్డి స్టేడియంలో సిటీ పోలీస్ ఆధ్వర్యంలో జాబ్ మేళా ప్రోగ్రాం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్. 3000 ఉద్యోగాలు కల్పించడానికి ముందుకు వచ్చాయి ప్రైవేట్ కంపెనీలు. ఈ జాబ్ మేళాకు పెద్ద ఎత్తున హాజరయ్యారు నిరుద్యోగులు. జాబ్ మేళాలు నిరుద్యోగులకూ ఎంతో ఉపయోగపడతాయన్నారు సీవీ ఆనంద్. కోవిడ్ వచ్చాక ఫిజికల్…
తెలంగాణలో గతంలో కంటే ఈసారి మార్చి నెలలోనే ఎండలు మండిపోతున్నాయి. రాష్ట్రంలో రోజురోజుకు పెరుగుతున్న విద్యుత్ వినియోగంపై అధికారులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో అత్యధిక విద్యుత్ ఫీక్ డిమాండ్ ను అధిగమించాయి విద్యుత్ సంస్థలు. ఇవాళ మధ్యాహ్నం 2.57 నిమిషాలకు 13742 మెగా వాట్స్ డిమాండ్ ఏర్పడింది. ఇప్పటివరకూ ఇదే రాష్ట్రంలో ఏర్పడిన అత్యధిక డిమాండ్. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత డిమాండ్ రావడం ఇదే మొదటిసారి అంటున్నారు అధికారులు. గత…
పెండింగ్ ట్రాఫిక్ చలాన్స్ క్లియర్స్ డిస్కౌంట్ ఆఫర్‌కు భారీగా స్పందన వస్తుంది.. ఇప్పటికే రూ.190 కోట్లకు పైగా ప్రభుత్వ ఖజానాకు డబ్బులు వచ్చి చేరాయి… ట్రాఫిక్ చలాన్స్ క్లియరెన్స్ మరియు ట్రాఫిక్ రూల్స్ బ్రేక్ చేసేవారిపై వ్యవహించనున్నతీరుపై మీడియాతో మాట్లాడిన ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్.. కీలక వ్యాఖ్యలు చేశారు.. 4 రోజులో డిస్కౌంట్ ఆఫర్‌కు భారీ స్పందన వచ్చిందన్న ఆయన.. మూడు కమిషనరేట్ల పరిధిలో అనూహ్య స్పందన వచ్చింది… 650 కోట్లకు పైగా విలువైన చలాన్స్…
నేడు ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న యోగి ఆదిత్యానాథ్.. యూపీ సీఎంగా రెండోసారి యోగికి బాధ్యతలు, సాయంత్రం 4 గంటలకు యూపీ సీఎంగా యోగి ప్రమాణం, హాజరుకానున్న ప్రధాని మోడీ, బీజేపీ అగ్రనేతలు.. నేడు తెలంగాణ వ్యాప్తంగా ఆందోళనలకు బీజేపీ పిలుపు.. రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల పెంపుపై ఆందోళన. తూర్పుగోదావరి జిల్లా: నేడు జాతీయ సంస్కృతి మహోత్సవాల్లో భాగంగా అమలాపురంలో శోభాయాత్ర అనంతపురం కదిరి శ్రీ ఖాద్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు స్వామివారి…
పుస్తకాలు చదవడం అంటే నాకెంతో ఇష్టం. కోటి రూపాయలను ఇవ్వమంటే ఇస్తా. ఒక సినిమా ఫ్రీగా చేయమంటే చేసేస్తానేమో కానీ.. ఒక బుక్ ఇవ్వమని అడిగితే ఇవ్వలేం. లైబ్రరీకి వెళితే పుస్తకాలన్నీ చదివేయాలని అత్యాశ వుంటుంది. మనం సంపాదించుకున్న నాలెడ్జ్ అలాగే మనదగ్గర వుంది. విలువలు పాటించే జర్నలిస్టులంటే నాకెంతో అభిమానం. ఎంవీఆర్ శాస్త్రి లాంటి వారు రాసిన బుక్స్ అంటే చాలా ఇష్టం. కనీసం 100 రూపాయల నోటు మీద అయిన నేతాజీ బొమ్మ ఉండాలి.…