గ్రూప్ 1, గ్రూప్ 2 ఉద్యోగాల సెలక్షన్ ప్రాసెస్‌లో కీలక మార్పులు చేయాలని నిర్ణయానికి వచ్చారు అధికారులు.. ఇప్పటి వరకు ఉన్న ఇంటర్వ్యూల ప్రాసెస్‌ను ఎత్తేయాలని నిర్ణయం తీసుకున్నారు. దీనిపై ఫైల్‌ను సిద్ధం చేసిన సాధారణ పరిపాలన శాఖ… ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదం కోసం ఫైల్‌ను పంపించింది.. కాగా, గ్రూప్ వన్‌లో ఇప్పటి వరకు ఇంటర్వ్యూకి వంద మార్క్‌లు ఉండగా.. గ్రూప్‌లో ఇంటర్వ్యూలకు 75 మార్క్‌లు ఉన్నాయి..
Read Also: New Born Baby: ఆడపిల్ల పుట్టిందని హెలికాప్టర్ ద్వారా స్వాగతం
అయితే, సమయం ఆదా చేయడంతో పాటు అవినీతి ఆరోపణలు రాకుండా కొత్త ప్రాసెస్ తీసుకొస్తున్నట్టుగా చెబుతున్నారు.. టీఎస్పీఎస్సీ ద్వారా నియామకం అయ్యే పోస్టుల్లో ఈ రెండింటికే ఇప్పటి వరకు ఇంటర్వ్యూలు ఉండగా.. అవికూడా రద్దు చేసేందుకు సిద్ధం అయ్యారు. మొదట గ్రూప్ వన్ నోటిఫికేషన్ వేయాలని నిర్ణం తీసుకున్నారు.. ఇప్పటికే 503 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి కూడా ఇచ్చింది.. అయితే, గ్రూప్ 2 పోస్టులకు మాత్రం ఇంకా అనుమతి రాలేదు.. కానీ, ఇంటర్వ్యూలపై క్లారిటీ వచ్చిన తర్వాతే గ్రూప్ 1 నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు చెబుతున్నారు.