వైద్యులకు యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు చేస్తున్నట్టు వెల్లడించారు సీఎం కేసీఆర్.. వైద్య రంగాభివృద్ధి కోసం బడ్జెట్ కేటాయింపులను భారీగా పెంచామన ఆయన.. వైద్యశాఖలో 21,073 పోస్టులను కొత్తగా మంజూరు చేశామన్నారు.. రాష్ట్రవ్యాప్తంగా నూతనంగా సూపర్ స్పెషలిటీ ఆసుపత్రుల నిర్మాణం చేస్తున్నాం.. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ చొప్పున అనుబంధంగా నర్సింగ్ కాలేజీలు ఏర్పాటు చేస్తున్నాం.. వాటికి నిర్మాణ పనులు చేస్తున్నాం అన్నారు.. ఇక, యూజీ, పీజీ, సూపర్ స్పెషలిటీ వైద్య సీట్ల పెంపు, నర్సింగ్ కాలేజీ సీట్ల సంఖ్య పెంచామని.. ప్రజల వద్దకే వైద్యం అనే లక్ష్యంతో బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశామని.. అదే స్ఫూర్తితో తెలంగాణ వ్యాప్తంగా పల్లె దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్టు వెల్లడించారు..
Read Also: AP: గవర్నర్‌తో అరగంటకు పైగా సీఎం చర్చలు
తెలంగాణ హెల్త్ ప్రొఫైల్ ను రూపొందించి ఆరోగ్య తెలంగాణ కోసం బాటలు వేశామని తెలిపారు కేసీఆర్.. ఆరోగ్యశ్రీ సేవల పరిధిని పెంచాం.. ఉద్యోగుల వయోపరిమితి పెంపుతో పాటు, వైద్య సిబ్బందికి వేతనాలు పెరిగాయని… వైద్యులకు యూజీసీ నిబంధనల మేరకు పీఆర్సీని అమలు జరుగుతుందన్నారు.. ఉక్రెయిన్‌లో వైద్యవిద్యనభ్యసిస్తున్న వైద్య విద్యార్థులకు మేలు చేకూర్చడం కోసం చర్యలు తీసుకున్నట్టు వెల్లడించారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు..