ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు స్కూళ్ల పనివేళలను కుదిస్తూ నిర్ణయం తీసుకున్న తెలంగాణ విద్యాశాఖ.. ఇప్పుడు మళ్లీ పెంచింది.. రాష్ట్రంలో ఒక్కపూట బడులు ప్రారంభం అయినప్పట్టి నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహించారు.. అయితే.. ఉష్ణోగ్రతలు పెరిగిన నేపథ్యంలో వారం రోజుల పాటు అంటే.. గత గురువారం నుంచి ఇవాళ్టి (ఏప్రిల్ 6వ తేదీ) వరకు ఉదయం 8 గంటల నుంచి 11.30 గంటల వరకే బడులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఇక, ఆ నిర్ణయం ప్రకారం.. ఇవాళ్టితో ఆ సమయం ముగియడంతో.. మళ్లీ పాత పని వేళలకే నిర్వహించనున్నట్టు వెల్లడించింది.
Read Also: KCR: రాష్ట్రవ్యాప్తంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణం