Pudding and Mink Drugs case: పోలీసులపై ఒవైసీ సెటైర్లు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్‌లో రేవ్ పార్టీ వ్యవహారం సంచలనం సృష్టించింది.. రాడిసన్ బ్లూ హోటల్‌లోని పుడింగ్ మింక్ పబ్‌లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో హైదరాబాద్ పోలీసులపై సెటైర్లు వేశారు హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ… డ్రగ్స్ వ్యవహారంపై సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఎంఐఎం ఎంపీ… డ్రగ్స్ కేసులో పోలీసులు పక్షపాత వైఖరి ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు… కేవలం పబ్ ఓనర్లనే అరెస్ట్ చేశారని విమర్శించిన ఒవైసీ.. బడాబాబుల పిల్లలందరినీ వదిలేశారని పేర్కొన్నారు.. ఇక, సంపన్న వర్గాలు, పేదలకు ఒకే రకమైన న్యాయం జరగదా? అంటూ ప్రశ్నిస్తూ ట్వీట్ చేశారు.. తన ట్వీట్‌ను తెలంగాణ మంత్రి కేటీఆర్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌కు ట్యాగ్ చేశారు ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ..
Read Also: Pakistan Crisis: రాజకీయ సంక్షోభంలో మరో ట్విస్ట్.. ఇమ్రాన్‌కు షాక్..
Also Read
- TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
- Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
- CM Revanth Reddy: ఓటర్ల జాబితా సవరణకు మరో 4 వారాలు ఇవ్వండి.. ఈసీకి సీఎం రేవంత్‌రెడ్డి లేఖ
- Night Bus Services: హైదరాబాద్‌లో నైట్ బస్ సర్వీసులు.. సెప్టెంబర్ 1 నుంచి ఈ 6 రూట్లలో ప్రారంభం..
మరోవైపు డ్రగ్స్ కేసులో కీలక విషయాలు వెలుగు చూస్తున్నాయి.. రిమాండ్ రిపోర్ట్‌లో పూర్తి విషయాలను పేర్కొన్నారు బంజారాహిల్స్ పోలీసులు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.40 గంటలకు పబ్‌కు సంబంధించిన సమాచారం వచ్చిందని.. రాడిసన్ బ్లు హోటల్‌లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్‌లో తెళ్లవరజామున 4 గంటలకు కోకైన్ సరఫరా చేస్తున్నరేని సమాచారం అందిందని.. ఈజీ మనీ కోసమే నిర్వాహకులు డ్రగ్స్‌ను సరఫరా చేస్తున్నట్టు పేర్కొన్నారు.. విశ్వసనీయ సమాచారం ఆధారంగా ఉన్నత అధికారులకు సమాచారం చేర వేశామని.. 1985 NDPS యాక్ట్ u/s 42(2) కింద కేసు నమోదు చేశామని వెల్లడించారు.. క్లూస్ టీమ్‌కు సమాచారం అందించి.. పబ్‌పై 2 గంటల ప్రాంతంలో దాడి చేసినట్టు తెలిపారు.. దాడి చేసే ముందు తమ వెంట ల్యాప్ టాప్, మినీ ప్రింటర్, వెయింగ్ మెషిన్, ప్యాకింగ్ మెటీరియల్ వెంట తీసుకెళ్లినట్టు పేర్కొన్నారు.. పబ్‌లోకి ఎంటర్ కాగానే మేనేజర్ అనిల్ కుమార్‌ను కలిసి దాడి సమాచారం ఇచ్చామని ఇప్పటికే ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నారు పోలీసులు.. క్లూస్ టీమ్‌తో కలిసి పబ్‌పై దాడి చేశామని.. పబ్‌లో అనిల్, ప్రవీణ్‌లను మధ్యవర్తులుగా పెట్టుకుని వారి సమక్షంలో దాడులు చేశామన్నారు.. మేనేజర్ అనిల్ కుమార్ వద్ద ప్లాస్టిక్ ట్రేలో కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.. మొత్తం 5 ప్యాకెట్లలో 4.64 గ్రాములు తెల్ల పౌడర్ స్వాధీనం చేసుకున్నామని వెల్లడించారు.. పబ్‌లోనే ఉన్న పాట్నర్ అభిషేక్‌ను అదుపులోకి తీసుకున్నామని.. అతడి మొబైల్ స్వాధీనం చేసుకున్నట్టు రిమాండ్ రిపోర్ట్‌లో వెల్లడించారు.
Rule of law is supreme Art 13 & it is very unfortunate that cocaine was found in this “Rave party” and all offspring’s of Rich kids where released not a single arrest apart from the owner of the place
Law should be applied equally to poor & rich @CPHydCity @KTRTRS https://t.co/WehHaS5BTK— Asaduddin Owaisi (@asadowaisi) April 6, 2022
తాజావార్తలు
-
TG EAPCET: తెలంగాణఎప్సెట్ (Bi.P.C) కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల.. పూర్తి వివరాలు ఇవే..
-
Uttar Pradesh survey: సీఎం యోగి ఇష్టమే కానీ.. యూపీ ఎన్నికల వేళ కీలక సర్వే
-
GST Council: సెప్టెంబర్ 12న జీఎస్టీ కౌన్సిల్ సమావేశం.. కీలక నిర్ణయం తీసుకునే ఛాన్స్
-
Irumudi : 9వ రోజు కూడా డే1 రేంజ్లో ‘ఇరుముడి’ ర్యాంపేజ్..గంటలో 25 వేల టికెట్ల సేల్
-
Minister Jupally: తెలంగాణలోని ఆ ప్రాంతంలో 130 ఎకరాల్లో ప్రపంచస్థాయి గోల్ఫ్ కోర్సు: మంత్రి జూపల్లి
ట్రెండింగ్
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!
-
ఇదేం ఫోన్ బాబోయ్.. బ్లాక్ అండ్ వైట్ నుంచి కలర్లోకి మారిపోతుంది..! Hisense A10 e-ink లాంచ్.!
-
రూ.15,999కే IP69 రేటింగ్, 120Hz డిస్‌ప్లే, 5,200mAh బ్యాటరీతో TECNO SPARK Go 3 Pro లాంచ్..!
-
50MP డ్యూయల్ కెమెరా, 7,900mAh బ్యాటరీతో సెప్టెంబర్ 3న భారత్‌లో లాంచ్ కానున్న Redmi 17 5G..!
-
10,000mAh బ్యాటరీ, డ్యూయల్ టోన్ డిజైన్, AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 4న రానున్న POCO X8 Power 5G..!