Five Members of a Family Found Dead in Miyapur: హైదరాబాద్‌లోని మియాపూర్‌లో దారుణం చోటు చేసుకుంది. మక్తా మహబూబ్ పేట్లో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. మృతదేహాలను మియాపూర్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి పరిశీలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఐదుగురు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. Also Read: Kohli-Rohit: వన్డేలకూ కోహ్లీ, రోహిత్ గుడ్‌బై చెప్పేశారా?.. అయోమయానికి గురైన అభిమానులు!…
Tomato Prices: తెలుగు రాష్ట్రాల్లో టమోటా ధరలు భారీగా పెరుగుతున్నాయి. వారం క్రితం వరకు కిలో 20 నుంచి 30 రూపాయలు పలికిన కిలో టమాటా ధర ఇప్పుడు భారీగా పెరిగింది. గత 15 రోజుల్లో టమాటా ధర డబుల్ అయిపోయింది. ప్రస్తుతం హోల్ సేల్ మార్కెట్లో కిలో టమాటా 60 నుంచి 70 రూపాయలు పలుకుతుంది.
హైదరాబాద్ మహానగరంలో పండగ వేళ విషాదం వరుసగా దాడి చేస్తోంది. గత రెండు రోజుల్లోనే కరెంట్ షాక్‌ల కారణంగా మొత్తం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోగా, మరొకరు ప్రాణాలతో పోరాడుతున్నారు. ఆదివారం రాత్రి శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా రామంతాపూర్ గోఖుల్‌నగర్‌లో నిర్వహించిన రథోత్సవం సమయంలో విద్యుత్ వైర్లు తగలడంతో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందారు.
తెలుగులో సింధూరం, డ్రింకర్ సాయి లాంటి సినిమాలు చేసి గుర్తింపు తెచ్చుకున్న నటుడు ధర్మ మహేష్ కాకాని అనూహ్యంగా చిక్కుల్లో పడ్డారు. మహేష్, అతని కుటుంబం మీద మహేష్ భార్య వరకట్నం కేసు ఫైల్ చేశారు. వెంటనే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ప్రస్తుతానికి గచ్చిబౌలి మహిళా పోలీస్ స్టేషన్లో ఒక కేసు రిజిస్టర్ అయింది. నిజానికి గతంలో కూడా అదనపు కట్నం కేసులో ధర్మ మహేష్ కొన్ని రోజులపాటు కౌన్సెలింగ్‌కి కూడా వెళ్లొచ్చారు.…
Honey Trap: హైదరాబాద్‌లో మరోసారి ఆన్లైన్ డేటింగ్ యాప్ ద్వారా మోసం జరిగింది. హింజ్ (Hinge) అనే డేటింగ్ యాప్‌లో శివాని పేరుతో ఓ యువతితో పరిచయం పెంచుకున్న ఒక యువకుడు సైబర్ నేరగాళ్లకు బలయ్యాడు. అమ్మాయి పూణే నుంచి హైదరాబాద్‌కు వచ్చానని, మూడు రోజుల పాటు నగరంలో ఉంటానని చెప్పి బుట్టలో వేసుకుంది. ఆ తర్వాత తరచూ వీడియో కాల్ చేస్తూ అతడి ఫోటోలను సేకరించింది. ఆపై వాటిని అసభ్యకరంగా మార్ఫింగ్ చేసి అందరికీ షేర్…
Dowry Harassment: హైదరాబాద్ నగరంలోని చందానగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో వరకట్న వేధింపులు మరొక కుటుంబాన్ని కుదిపేశాయి. 29 ఏళ్ల వివాహిత జె.కావ్య అలియాస్ మానస ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కలకలం రేపింది. మృతురాలి కుటుంబ సభ్యుల సమాచారం ప్రకారం మూడు సంవత్సరాల క్రితం కావ్యకు రాజుతో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది కాలంలోనే భర్త రాజు అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టాడని.. అలాగే పిల్లలు పుట్టడం లేదని మానసికంగా, శారీరకంగా హింసించాడని వారు ఆరోపిస్తున్నారు.…
కొడుకు.. కూతురు.. అడ్డదారుల్లో వెళ్తుంటే అడ్డుకోవాల్సిన తల్లే.. వాళ్లతో అక్రమ దందా చేయించింది. కెమికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసిన కొడుకును.. తాను చేసే కంత్రీ పనుల్లో భాగం చేసింది. ఇల్లు చక్కదిద్దుకోవడమెలా అని నేర్పించాల్సిన కూతురికి ఇల్లీగల్ పనులు అప్పజెప్పింది. పేదింటి మహిళలతో తప్పుడు పనులు చేయిస్తూ… డబ్బులు వెనకేసుకుంది. ఇంతకూ ఎవరా కిలేడీ…? మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో వెలుగులోకి వస్తున్న విస్తుపోయే అంశాలేంటి..? Also Read:Shubhanshu Shukla: ప్రధాని మోడీని కలిసిన శుభాన్షు శుక్లా..…
ఇటీవల అనారోగ్య కారణాలతో కన్నుమూసిన కోట శ్రీనివాసరావు భార్య రుక్మిణి, ఈ రోజు తెల్లవారుజామున హైదరాబాద్ నివాసంలో కన్నుమూశారు. నిజానికి, కోట శ్రీనివాసరావు ఉన్నప్పటి నుంచే ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. చాలా కాలం నుంచే రుక్మిణి అనారోగ్య కారణాలతో ఇబ్బంది పడుతున్నారు. ఇక, ఈ రోజు తెల్లవారుజామున ఆమె మరణించినట్లు సమాచారం. Also Read:Harinya Reddy: బిగ్ బాస్ కీలక టీం మెంబర్, ప్రొడ్యూసర్.. రాహుల్ చేసుకోబోయే అమ్మాయి షాకింగ్ బ్యాక్ గ్రౌండ్ ఇక, కొద్దిసేపటి క్రితమే…
మేడ్చల్ కమర్షియల్ సరోగసి కేసులో విస్తుపోయే అంశాలు వెలుగుచూశాయి. ఏపీ చిలకలూరిపేట కి చెందిన లక్ష్మీ రెడ్డి పై 2024 లో ముంబై లో హ్యూమన్ ట్రాఫికింగ్ కేసు నమోదైంది. కొన్ని నెలల క్రితం హైదరాబాద్ చేరుకున్న లక్ష్మీ రెడ్డి.. కొడుకు నరేందర్ రెడ్డి, కూతురు తో కలిసి మరో దందాకు తెరలేపింది. మాదాపూర్, అమీర్‌పేట, RTC x రోడ్ ప్రాంతాల్లో ఉన్న ఫర్టిలిటీ సెంటర్ల తో పరిచయాలు ఏర్పర్చుకుంది. అండాలు కావాలన్నా.. సరోగసి కోసం మహిళలు…
ఈజీగా డబ్బు సంపాదించేందుకు మోసాలకు పాల్పడుతున్నారు కొందరు వ్యక్తులు. తాజాగా ఘరానా మోసం వెలుగుచూసింది. అధిక వడ్డీ ఆశ చూపి ఏకంగా రూ. 20 కోట్లు కాజేశాడు ఓ ఘనుడు. అతడే మల్కాజిగిరి కి చెందిన దినేష్ పాణ్యం. వృద్ధులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులే టార్గెట్ గా భారీ మోసానికి తెరలేపాడు. ఆఖరికి రూ. 20 కోట్లు కాజేసి పరారయ్యాడు. పూర్తివివరాల్లోకి వెళ్తే.. దినేష్ పాణ్యం మల్కాజిగిరి అడ్డాగా ఓ ఆఫీస్ ఏర్పాటు చేసుకున్నాడు. షేర్…