హైదరాబాద్ కొండాపూర్లోలోని ఓ సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ కలకలం రేపిన విషయం తెలిసిందే. సమాచారం అందుకున్న పోలీసుల దాడి చేశారు. 2 కేజీల గంజాయి సహా మరిన్ని మత్తు పదార్థాలు సీజ్ చేశారు. ఈ రేవ్ పార్టీలో 9 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొండాపూర్ రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగుచూస్తున్నాయి. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్ కుమార్ అరెస్ట్ అయ్యాడు. అశోక్ కుమార్ వద్ద డ్రగ్స్, గంజాయి, కండోమ్స్…
ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశమవుతోంది. స్థానిక ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల కోసం గవర్నర్‌కు పంపిన ముసాయిదాపై చర్చించబోతోంది. సిగాచి అగ్నిప్రమాదంపై నివేదిక, సీతారామ ప్రాజెక్టు, దేవాదుల ఎత్తిపోతల ప్రాజెక్టు పనుల అంచనాల సవరణపై డిస్కస్ చేసే అవకాశం వుంది. మరోవైపు కాళేశ్వరంపై కేబినెట్లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను ప్రవేశపెట్టే ఛాన్స్ వుంది.
ఇటీవలి కాలంలో భర్తలను భార్యలు అంతమొందిస్తున్న ఘటనలు ఎక్కువైపోయాయి. పతియే ప్రత్యక్ష దైవం అన్న దగ్గర్నుంచి కాటికి పంపే స్థితికి చేరుకున్నారు కొందరు భార్యలు. తాజాగా హైదరాబాద్‌లో మరో దారుణం వెలుగుచూసింది. కుత్బుల్లాపూర్‌లో దారుణం చోటుచేసుకుంది. భర్త రాందాస్‌ను చంపేందుకు నలుగురు యువకులతో కలిసి భార్య జ్యోతి ప్లాన్ చేసింది. బౌరంపేటలో రాందాస్‌కు మద్యం తాగించి, యువకులతో బీర్‌బాటిళ్లతో దాడి చేయించింది. దాడి అనంతరం రాందాస్ అపస్మారకస్థితిలోకి వెళ్లడంతో చనిపోయాడనుకొని అక్కడి నుంచి వెళ్లిపోయారు యువకులు. Also…
Kondapur Apartment Rave Party: ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువగా వినిపిస్తున్న మాట ‘రేవ్ పార్టీ’. ఆ మధ్య బెంగళూరులో, ఈ మధ్య సింగర్ సావిత్రి రేవ్ పార్టీలు వార్తల్లో నిలిచాయి. రేవ్ పార్టీలో వంద మందికి పైగా సెలబ్రెటీలు, బడా బాబుల పిల్లలు, రాజకీయ నేతల కుమారులు పట్టుబడుతున్నారు. పోలీసులు ఎన్ని చర్యలు తీసుకున్నా.. రేవ్ పార్టీలు మాత్రం ఆగడం లేదు. తాజాగా హైదరాబాద్ నగరంలో మరో రేవ్ పార్టీ వెలుగు చూసింది.…
ఫోన్ ట్యాపింగ్ కేసు హైదరాబాద్‌లో ఇటీవల కలకలం రేపుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బండి సంజయ్‌పై సిట్ విచారణ జరపాలని నిర్ణయించబడింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో రేపు (జులై 28, 2025) జరగబోయే సిట్ (స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం) విచారణకు హాజరు కాలేనని ప్రకటించారు. ఆపరేషన్ సింధూర్ పై పార్లమెంటులో జరగనున్న చర్చ కారణంగా తప్పనిసరిగా పార్లమెంట్ సమావేశాలకు హాజరు కావాల్సి ఉన్నందున ఈ నిర్ణయం…
రాయదుర్గం పోలీస్ స్టేషన్ పరిధిలోని మణికొండలో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన స్థానికంగా కలకలం రేపింది. మృతుడు ఆంధ్రప్రదేశ్ ఈస్ట్ గోదావరి జిల్లా రాజమహేంద్రవరానికి చెందిన గుట్టల వేణుగోపాల్ (26)గా గుర్తించారు. వేణుగోపాల్ తన అన్న, వదినతో కలిసి మణికొండలో నివాసం ఉంటూ ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఆదివారం ఉదయం, తాను నివసిస్తున్న ఇంట్లో సీలింగ్ ఫ్యాన్‌కు బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనను గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు…
హైదరాబాద్ లోని చిత్రపురి కాలనీ పై కొన్ని సంవత్సరాలుగా ఎన్నో ఆరోపణలు మీడియాలో వినిపిస్తూ ఉన్నాయి. వాటిపై ఒక క్లారిటీ ఇస్తూ చిత్రపురి కాలనీ అధ్యక్షులు వల్లభనేని అనిల్ కుమార్ మీడియా ముందుకు వచ్చారు. ఈ సమావేశంలో చిత్రపరి కాలనీలో కొత్తగా నిర్మించబోతున్న సఫైర్ సూట్, రో హౌసెస్, డూప్లెక్స్ తదితర నిర్మాణాలకు సంబంధించి అలాగే టవర్స్ కి సంబంధించిన వాటిపై క్లారిటీ ఇచ్చారు. అనిల్ కుమార్ మాట్లాడుతూ కాలనీలో ఎన్నో అవకతవకలు జరుగుతున్నట్లు, అలాగే కోట్ల…
Finance Scam: హైదరాబాద్ బంజారాహిల్స్ కి చెందిన ఫైనాన్స్ వ్యాపారి సునీల్ కుమార్ ఓజా, అతని కుమారుడు ఆశిష్ కుమార్ ఓజా చేసిన మోసాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. పలువురు రియల్ ఎస్టేట్ వ్యాపారులకు ఫైనాన్స్ కి కోట్ల రూపాయలు ఇస్తూ వారి భూములను కాజేస్తున్నారు. సునీల్ కుమార్ ఓజా మొదట ఫైనాన్స్ కి డబ్బులు ఇస్తాడు.. అందుకు షూరిటీగా వారికి సంబంధించిన భూమి ఫ్లాట్స్ జిపిఏ లేదా రిజిస్ట్రేషన్ చేసుకుంటాడు. ఇక గడువు అనంతరం ఫైనాన్స్…
Hyderabad: హైదరాబాద్ నగరంలో మరో కుటుంబ కలహం తీవ్ర విషాదానికి దారి తీసింది. అంబర్‌పేట్‌కు చెందిన గోపి కుమార్ (35) అనే వ్యక్తి, భార్య పుట్టింటికి వెళ్లిందనే మనోవేదనతో ఆత్మహత్యకు పాల్పడి చివరకు ప్రాణాలు కోల్పోయాడు. గోపి కుమార్‌కు మరో మహిళతో అక్రమ సంబంధం ఉందని అనుమానించిన భార్య ఆమె పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ విషయమై భార్యతో వాగ్వాదం కూడా జరిగినట్టు సమాచారం. Fake Certificates: నకిలీ సర్టిఫికెట్స్ ముఠాను అరెస్ట్ చేసిన SOT బృందం..! అయితే,…
హరి హర వీరమల్లు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ ఓపెనింగ్ అందుకున్నారు. సినిమాకి మిక్స్డ్ టాక్ వచ్చినా, ఓపెనింగ్ విషయంలో మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గడం లేదు. ఈ రోజు అమరావతిలో క్యాబినెట్ మీటింగ్ అనంతరం ఆయన హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సక్సెస్ మీట్లో ఆయన మాట్లాడారు. నా జీవితంలో ఇది మొదటి సక్సెస్ మీట్ అని పేర్కొన్న ఆయన, పోడియం లేకపోతే మాట్లాడలేకపోతున్నాను…