Hyderabad Metro: మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు.. 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు!
- మెట్రో రైలులో గుండె, ఊపిరితిత్తుల తరలింపు
- 45 నిమిషాల్లోనే 2 ఆస్పత్రులకు అవయవాలు
- ఈ ఏడాదిలో ఇది నాలుగోసారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Hyderabad Metro Saves Two Lives with Organ Transport: హైదరాబాద్ మెట్రో రైలు ఈ ఏడాది నాలుగోసారి ప్రాధాన్యతా వైద్య రవాణా సౌకర్యాన్ని కల్పించింది. జీవితాన్ని కాపాడే గుండె, ఊపిరితిత్తులను మంగళవారం (సెప్టెంబర్ 2) రెండు వేర్వేరు ఆస్పత్రులకు తరలించింది. సకాలంలో అవయవాలను అమర్చడంతో ఇద్దరికి పునర్జన్మనిచ్చినట్లయింది. మంగళవారం రాత్రి 9 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య విజయవంతంగా ఈ రవాణాను చేపట్టారు. ఓ దాత నుంచి లభించిన గుండె, ఊపిరితిత్తులు.. హైదరాబాద్ మెట్రోలో అత్యవసర వైద్య రవాణా ద్వారా సురక్షితంగా తరలించబడ్డాయి.
కామినేని ఆస్పత్రి (ఎల్‌బీనగర్)లో ఓ దాత నుంచి సేకరించిన గుండెను యశోద హాస్పిటల్ (పరేడ్ గ్రౌండ్స్)కు హైదరాబాద్ మెట్రో రైలులో తరలించారు. 8 స్టేషన్ల మధ్య గల 11 కిమీ దూరాన్ని కేవలం 16 నిమిషాల్లోనే పూర్తి చేశారు. ఎల్‌బీనగర్ కామినేని ఆస్పత్రి నుంచి గుండెను మాధాపూర్ యశోద ఆస్పత్రికి చేర్చారు. 21 స్టేషన్ల మధ్య గల 27 కిమీ దూరాన్ని 43 నిమిషాల్లో పూర్తి చేశారు. భారీ వర్షాలు, పీక్ అవర్ ట్రాఫిక్ మధ్య జరిగినప్పటికీ.. ఈ ప్రాణరక్షక రవాణా 45 నిమిషాల లోపే పూర్తయింది. దీంతో వైద్య అత్యవసరాల సమయంలో హైదరాబాద్ మెట్రోనే అత్యంత నమ్మదగినదిగా, వేగవంతమైనదిగా మరోసారి నిరూపితమైంది.
Also Read
- India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
- India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
- Honda Rebel 500 Recall: హోండా కీలక ప్రకటన.. Rebel 500 బైక్‌లు రీకాల్.. అసలు సమస్య ఏంటంటే?
- Mohsin Naqvi: హమ్మయ్య.. భారత్-పాక్ ఫైనల్ ఫైట్‌కు పాకిస్థాన్ ట్రోఫీ దొంగ డుమ్మా..!
Also Read: BCCI: టైటిల్ స్పాన్సర్ వేటలో బీసీసీఐ.. ఆ కంపెనీలకు నో ఛాన్స్!
ఈ కీలకమైన మిషన్ విజయవంతం కావడానికి హైదరాబాద్ మెట్రో రైలు, వైద్య నిపుణులు సహా ఆసుపత్రి అధికారుల సమన్వయం కీలక పాత్ర పోషించింది. ఎల్ అండ్ టీ మెట్రో రైలు (హైదరాబాద్) లిమిటెడ్ అత్యవసర సేవలకు అండగా నిలుస్తూ, ప్రాణాలను రక్షించడంలో నగరానికి జీవనాధారంగా కొనసాగుతుంది. 45 నిమిషాల వ్యవధిలోనే గుండె, ఊపిరితిత్తులను రెండు ప్రాంతాలకు తరలించామని ఎల్ అండ్ టీ అధికారులు చెప్పారు. ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో రైలుపై ప్రశంసలు కురుస్తున్నాయి.
తాజావార్తలు
-
India vs Pakistan: మళ్లీ అదే సీన్ రిపీట్.. పాకిస్థాన్‌ను కూరలో కరివేపాకులా తీసి పారేసిన టీమిండియా..!
-
MALDIVES: అప్పట్లో అక్కడో దేశం ఉండేది..!
-
Akshara Haasan: “టెన్త్‌లో 3 సార్లు ఫెయిల్.. చదువు ఆపేశా”.. కమల్ హాసన్ కూతురి షాకింగ్ కామెంట్స్!
-
India vs Pakistan: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్.. టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే..
-
BYD Denza D9: BYD Denza D9 భారత్‌లోకి.. 800KM రేంజ్, మసాజ్ సీట్లతో లగ్జరీ MPV!
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!