నగర పోలీస్ కమిషనర్ సీపీ సీవీ ఆనంద్ రేపు జరగబోయే గణేష్ నిమజ్జనానికి సర్వం సిద్ధంగా ఉన్నామని తెలిపారు. సీపీ ఆనంద్ మాట్లాడుతూ.. “పటిష్టమైన పోలీస్ భద్రత ఏర్పాటు చేశాము.. 40 గంటల పాటు నిమజ్జనం సాగబోతుంది.. రేపు ఒక్క ట్యాంక్ బండ్ లోనే 50 వేల విగ్రహాలు నిమజ్జనం అవుతాయి.. నిమజ్జనానికి ఏర్పాట్లు పూర్తి చేశాము.. నిన్న కూడా ఛత్రినాకలో ఒక ఘటన జరిగింది.. విగ్రహం ఎత్తు ఉండటం వల్ల కరెంట్ వైర్ కు తగలకుండా ఉండేలా సుమారు 6 గంటలు కస్టపడాల్సి వచ్చింది.. ఎట్టి పరిస్థితుల్లో డీజే లకు అనుమతి లేదు.. గత సంవత్సరం డీజే కారణంగా చాలా మంది చనిపోయారు.. డీజే వైబ్రేషన్స్ వల్ల యువకుల ఆరోగ్యం దెబ్బ తింటుంది.. భాగ్య నగర గణేష్ ఉత్సవ సమితి కూడా డీజే వద్దు అంటే ఒప్పుకుంది..
Also Read:Trump: యుద్ధాలపై ట్రంప్ కొత్త పలుకు.. ఎన్ని ఆపారో సంఖ్య చెప్పిన అధ్యక్షుడు
ఇందులో మతం అంశమే లేదు, పూర్తిగా ప్రజల ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే చెబుతున్నాం.. ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనం రేపు ఉదయం 6 గంటల నుండి 1:30 వరకు అయిపోయేలా చూస్తాము.. సౌత్ జోన్ విగ్రహాల తరలింపు మాకు అత్యంత ప్రాధాన్యత.. మొత్తం 30 వేల మంది పోలీసులు షిఫ్ట్ లో ఉంటారు.. వందల సి సి కెమెరాలు ఉన్నాయి.. అదనంగా 250 సీసీ కెమెరాలు కొన్నాం.. 6 డ్రోన్స్ తో గణేష్ నిమజ్జనం పర్యవేక్షిస్తాం.. 34 జగిలాలు ఉన్నాయి.. ఎక్కువగా పని భారం అయ్యింది.. రెండు మరణించాయి.. జాగిలాల రక్షణ, సంఖ్య పెంచాలని నిర్ణయించుకున్నాము.. 54కు పెంచాలని నిర్ణయించుకున్నాము.. జాగిలాల క్వాలిటీపై ఇన్ బ్రిడింగ్ సమస్య ఉంది.. పోలీసు డ్యూటీకి సరిగ్గా ఉండేలా కమిటీ వేశాము.. కమిటీ మొత్తం జాగిలాల లవర్స్..
వారికే అనుభవం ఉంటుంది కాబట్టి దేశంలో ఉన్న అన్ని జాగిలాలను గుర్తించాం.. సెంట్రల్ డాగ్ బ్రిడింగ్ దగ్గర కొనేవాళ్ళం.. అభిజిత్ ఫామ్ దగ్గర చెక్ చేసుకొని కొత్తగా 12 జాగిలాలను తీసుకున్నాం.. డాగ్ ట్రైనింగ్ కోసం ISW కు పంపుతాం.. హాండ్లర్ ట్రైనింగ్ జరుగుతుంది.. బాంబులను తనిఖీ చెయ్యడానికి వాసన చూసి డాగ్స్ తనిఖీ చేస్తాయి.. మానవులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో వీటిని వాడుతాము.. సిటీ సెక్యురిటీ వింగ్ మండపాల్లో, కొన్ని ప్రాంతాల్లో డాగ్స్ తో తనిఖీలు చేస్తున్నాం.. నిమజ్జనాల్లో కూడా జగిలాలను వాడుతాము.. మొదటి దశలో 12 తీసుకున్నాం.. మరికొన్ని తీసుకుంటాం.. పదకొండున్నర ఎకరాల్లో మౌంటెడ్, డాగ్ కెనాల్ ని నిర్మిస్తాం.. 8వ తేదీన టెండర్లు పూర్తవుతాయి.. 60జాగిలాల కోసం ప్లేస్ ఇస్తూ డాగ్ కెనాల్ కడుతం.. 50గుర్రాలు ఉన్నాయి.. మూడు రిటైర్డ్ అయ్యే స్టేజ్ లో ఉన్నాయి.. మౌంటెడ్ పోలీసు కి మహిళలను ఏర్పాటు చేసాం..
Also Read:#SSMB29 : 120 దేశాల్లో విడుదలకు ప్లాన్.. రాజమౌళి కొత్త రికార్డు
దేశంలో కీలక నిర్ణయం మహిళ మౌంటెడ్ పోలీసులు.. రేపటి నుండి మొదటిసారి మౌంటెడ్ మహిళ పోలీసులు, పోలీసులు గస్తీలో నిమగ్నమై ఉంటారు.. అన్ని రంగాల్లో మహిళలు ముందుకు రావాలి.. అందుకే మౌంటెడ్ లో మహిళల్ని భాగస్వామ్యం చేసాం.. సీఎం కేటాయించిన స్థలంలో మౌంటెడ్, డాగ్ కెనాల్ ని నిర్మిస్తాం.. డాగ్ స్క్వాడ్, మౌంటెడ్ గుర్రాలు పోలీసులకు చాలా ముఖ్యం.. క్రైమ్ జరిగిన సందర్భంలో స్నిఫర్, డాగ్ ట్రాకర్స్, అటాక్ డాగ్స్ ఇలా అన్నీ వాడుతాము.. గుర్రాలు క్రౌడ్ కంట్రోల్ లో వాడుతాము.. మొహరం బందోబస్తులో ఏనుగులు నడుస్తాయి.. ఏనుగు చుట్టూ జనాలు ఉంటారు కాబట్టి గుర్రాలతో క్రౌడ్ కంట్రోల్ చేశాము” అని తెలిపారు.