Suicide : హైదరాబాద్ నగరంలోని కేపిహెచ్బీ కాలనీలో దురదృష్టకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా నివసించే 9వ తరగతి విద్యార్థిని లాస్య ప్రియ (13) బాత్రూం కిటికీ నుండి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే, మంజీరా ట్రినిటీ హోమ్స్‌లో 17వ అంతస్తులో నివాసముండే హరినారాయణమూర్తి కుటుంబానికి చెందిన లాస్య ప్రియ, అడ్డగుట్టలోని నారాయణ స్కూల్లో చదువుతోంది. సోమవారం జరిగిన పేరెంట్-టీచర్ మీటింగ్‌లో విద్యాభ్యాసంపై తగిన శ్రద్ధ చూపడంలేదని టీచర్లు తల్లిదండ్రులకు సూచించారు. దీని తర్వాత ఆమె…
బంజారా హిల్స్ లో యువకుడి కిడ్నాప్ కలకలం రేపింది. పబ్ లో ఎంజాయ్ చేద్దాం రమ్మని పిలిచి.. ఓ యువకుడిని కిడ్నాప్ చేసింది ఓ మహిళ. భర్తతో కలిసి కిడ్నాప్ కు పాల్పడింది. మద్యం మత్తులో ఉన్న యువకుడి నగ్న వీడియోలు తీసి డబ్బుల కోసం బెదిరింపులకు పాల్పడ్డారు. ఆభరణాల షాపు ఉద్యోగిపై భారీ స్కెచ్ వేశారు దంపతులు. యువకుడు హత్యకు గురయ్యాడంటూ టాస్క్ ఫోర్స్ పోలీసుల పేరుతో సినీ ఫక్కీలో డ్రామాకు తెరలేపారు. బాధితుడు బంజారా…
ఫిలిమ్ నగర్ లోని దక్కన్ కిచెన్ కూల్చివేత పై నేడు నాంపల్లి కోర్టులో విచారణ జరుగనుంది. కాగా ఈ కేసులో ఇప్పటికే సినీ నటులు వెంకటేశ్‌తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానాపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేశ్, నిర్మాత సురేశ్ బాబు, హీరో రానా పై ఫిల్మ్ నగర్ పోలీసులు 448, 452,458,120 బీ సెక్షన్లపై కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో ఫిలిమ్ నగర్…
హైదరాబాద్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక ఇప్పుడు.... కాస్త రాజకీయ అవగాహన ఉన్న ప్రతి ఒక్కర్నీ విపరీతంగా ఆకర్షిస్తోంది. దీనికి సంబంధించి త్వరలోనే...త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇది బీఆర్ఎస్ సిట్టింగ్ సీటు కాగా... అధికార పార్టీగా... ఎట్టి పరిస్థితుల్లో ఈసారి తమ చేయి దాటి పోనివ్వకూడదన్న పట్టుదలగా ఉంది కాంగ్రెస్. అటు బీజేపీ కూడా ప్రతిష్టాత్మకంగా భావిస్తుండటంతో... ఈ ఎన్నికల యుద్ధంపై ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది.
భారతదేశంలో ఆరోగ్య సంరక్షణ అందుబాటును మరింత అందుబాటులోనికి తీసుకొచ్చే ఒక మార్గదర్శక ప్రయత్నంలో, హైదరాబాద్ నందు ప్రముఖ ఆరోగ్య సంరక్షణ కేంద్రం అయిన స్టార్ హాస్పిటల్స్, భారతదేశపు అగ్రగామి కమ్యూనిటీ మేనేజ్మెంట్ ప్లాట్‌ఫారమ్ అయిన మైగేట్తో కలిసి ‘స్టార్ సర్వీసెస్ ఆన్ మైగేట్’ (STAR Services on MyGate) సేవల్ని ప్రారంభించింది . ఈ చారిత్రాత్మక కార్యక్రమం 30 జూలై 2025న మధ్యాహ్నం 12:30 గంటలకు నానక్‌రామ్‌గూడలోని స్టార్ హాస్పిటల్‌లోని ప్రమాణ హాల్లో అధికారికంగా ప్రారంభించబడింది. అనంతరం…
RS 11 Crore Cash Seized in Kubera Movie Style in Hyderabad: ఏపీలో లిక్కర్ స్కామ్ జరిగితే.. హైదరాబాదులో నోట్ల కట్టలు ఏరులై పారుతున్నాయి. అచ్చం ‘కుబేర’ సినిమా తరహాలో ఫామ్‌హౌస్‌లో ఏకంగా 11 కోట్ల రూపాయల నగదు దొరకడం తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టిస్తుంది. కుబేర సినిమా స్టైల్లోనే బియ్యం బస్తాలు, అల్మారాలో డబ్బులు దాచి పెట్టారు. ఏకంగా 11 కోట్ల రూపాయలను సర్దేసి పెట్టారు. ఎవరో వస్తారు.. కీ చెప్తారు.. డబ్బులు…
మణికొండలో వాటర్ ట్యాంకర్ల అరాచకం, ఓవర్ స్పీడ్ తో విన్యాసాలు చేస్తున్న వాటర్ ట్యాంక్ డ్రైవర్లు, చోద్యం చూస్తున్న హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్, మణికొండ మున్సిపాలిటీ. మణికొండ పుప్పాలగూడలో వాటర్ ట్యాంకర్లు అరాచకం సృష్టిస్తున్నాయి. డ్రైవర్లు ఇష్టారాజ్యంగా వాహనాలు నడుపుతున్నారు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. రెండు నెలల్లోని నలుగురు ప్రమాదాలకు గురై చనిపోయారు, కనీసం పట్టించుకోకుండా హైదరాబాద్ మెట్రో వాటర్ వర్క్స్ చోద్యం చూస్తోంది. మణికొండ మున్సిపాలిటీ గురించి అయితే చెప్పాల్సిన పని లేదు.…
హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, ఇతర ముఖ్య నేతలతో కలిసి జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనీ రోడ్ నంబర్ 5 ,ఇందిరా నగర్ లోని భద్రాచలం కేఫ్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నగరవాసులకు శుభవార్తను అందించారు. ఆగస్టు ఒకటి నుంచి హైదరాబాద్ లో రేషన్ కార్డుల పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. 50 వేల రేషన్ కార్డులు పంపిణీ చేయనున్నారు. 2 లక్ష 50 వేల మంది పేర్లు రేషన్ కార్డులో చేర్చాము అని తెలిపారు.…
గంజాయి పెడ్లర్స్ భరతం పడుతోంది ఈగల్ టీమ్. గంజాయి, డ్రగ్స్ రవాణాకు పాల్పడుతున్న వారి పట్ల ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ లో ఈగల్ టీమ్ భారీగా గంజాయిని పట్టుకుంది. ఏకంగా రూ. 5 కోట్లు విలువైన 935 కిలోల గంజాయిని సీజ్ చేసింది. బాటసింగరం ఫ్రూట్ మార్కెట్ సమీపంలో ఈగల్ టీమ్ పట్టుకుంది. ఒడిశా నుంచి మహారాష్ట్ర కు తరలిస్తుండగా పట్టుకుంది. 35 సంచుల్లోని 455 గంజాయి ప్యాకెట్లు సీజ్ చేశారు. Also Read:XXX vs…
గుండె పోటు మరణాలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గర్నుంచి పెద్ద వాళ్ల వరకు గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోతున్నారు. అప్పటి వరకు ఎంతో ఉల్లాసంగా కనిపించిన వారు క్షణాల్లోనే విలవిల్లాడుతూ కుప్పకూలుతున్నారు. ఆసుపత్రికి తరలించే లోపే తుది శ్వాస విడుస్తున్నారు. తాజాగా నాగోల్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ 25 ఏళ్ల యువకుడు షటిల్ ఆడుతూ గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న కొందరు యువకులు సీపీఆర్ చేసిన ప్రయోజనం లేకుండా…