Balapur Ganesh Laddu Auction 2025: గణేష్ లడ్డూ వేలం పాట అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది బాలాపూర్ గణనాథుడే.. ఎందుకంటే.. బాలాపూర్ గణపతి దగ్గర లడ్డూ వేలం పాట ప్రారంభమైంది.. ఇది క్రమంగా.. అంతటా విస్తరించింది.. బాలాపూర్‌లో 1994లో రూ.450తో ప్రారంభమైన ఈ లడ్డూ వేలం.. ప్రతీ ఏడాది పెరుగుతూ వచ్చింది.. 2023లో రూ.27 లక్షలు పలకగా.. 2024లో రూ.30.01 లక్షలకు చేరి తన రికార్డును తానే అధిగమించాడు బాలాపూర్ గణపయ్య.. 2024లో బీజేపీ నేత కొలన్ శంకర్ రెడ్డి ఈ లడ్డూను గెలుచుకున్నారు. బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటే సకల విజయాలు సిద్ధిస్తాయని భక్తుల విశ్వాసం.. అందుకే ప్రతీఏడాది లడ్డూ వేలం కోసం పోటీ పడుతుంటారు భక్తులు.. అయితే, బాలాపూర్ గణపతి లడ్డూ వేలంకి ఓ ప్రత్యేకత ఉంటుంది.. గత ఏడాది యాక్షన్‌లో పలికిన లడ్డూ ధరను ముందుగా డిపాజిట్ చేసినవారికే ఈ వేలంలో పాల్గొనే అవకాశం ఉంటుంది..
Read Also: Khairatabad Ganesh Nimajjanam: కాసేపట్లో ప్రారంభం కానున్న ఖైరతాబాద్ గణేష్ శోభాయాత్ర
కాగా, 1994లో మొదటిసారి లడ్డూ వేలంలో రూ.450కి కొలన్ మోహన్‌రెడ్డి దక్కించుకున్నారు. ఇప్పటివరకు 30 సార్లు వేలం నిర్వహించింది బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి.. అయితే, 2020లో కరోనా కారణంగా వేలం లేకుండానే అప్పటి సీఎం కేసీఆర్ కు అందజేశారు. ఇక ప్రతీ ఏడాది లడ్డూ ధర పెరుగుతూ వస్తోంది.. రూ.1116తో మొదలయ్యే పాట మెల్లి మెల్లిగా లక్షలకు చేరుకుంటుంది. వేలంలో పాల్గొనేందుకు బాలాపూర్ వాసులే కాకుండా ఇతర ప్రాంతాల వారూ వస్తుంటారు. బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి రూల్స్ ప్రకారం.. ముందుగా డబ్బులు డిపాట్ చేసినవారికే యాక్షన్‌లో పాల్గొనే అవకాశం ఉండగా.. ఈ సారి బరిలో నిలిచారు ఏడుగురు.. వారి పేర్లను బాలాపూర్ గణేష్ ఉత్సవ సమితి ప్రకటించింది..
ఈ సారి లడ్డూ యాక్షన్‌లో ఉన్నవారు వీరే..
1. మర్రి రవికిరణ్ రెడ్డి (చంపాపేట్),
2. అర్బన్ గ్రూప్ సామ ప్రణీత్ రెడ్డి (ఎల్బీ నగర్)
3. లింగాల దశరథ్ గౌడ్ (కర్మాన్‌ఘాట్)
4. కంచర్ల శివారెడ్డి (కర్మాన్‌ఘాట్)
5. సామ రాంరెడ్డి (దయా).. కొత్తగూడెం, కందుకూరు
6. పీఎస్‌కే గ్రూప్ (హైదరాబాద్)
7. జిట్టా పద్మా సురేందర్‌రెడ్డి (చంపాపేట్)