బంగారం అంటే అందరికీ మక్కువే. ఆడవాళ్లకే కాకుండా.. మగవాళ్లు కూడా వంటిపై ధరిస్తారు కాబట్టి .. బంగారం ధరలపై ప్రజలు నిత్యం ఒక కన్నేసి ఉంటారు. బంగారం ధరలు తగ్గాయంటే కొనడం కోసం చూస్తుంటారు. పెళ్లిళ్ల సీజన్లో బంగారం ధరలు తగ్గాయంటే ప్రజలు పండగ చేసుకోకుండా ఉంటారా?
తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు రేపటి (జూన్ 2న) నుంచి ఈ నెల 22 వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పశుసంవర్ధక శాఖల ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నిర్ణయం తీసుకున్నారు.
ప్రపంచంలోనే తొలి త్రీడీ ప్రింటెడ్ టెంపుల్ తో తెలంగాణ మరో అరుదైన ఘనతను సాధించనుంది. హైదరాబాద్ కు చెందిన నిర్మాణ సంస్థ అప్సుజా ఇన్ఫ్రాటెక్, సింప్లిఫోర్జ్ క్రియేషన్స్ భాగస్వామ్యంతో ఈ కాంప్లెక్స్ ను నిర్మిస్తున్నారు.
దక్షిణ మధ్య రైల్వే 2023 మే నెలకుగాను ప్రయాణికులు, సరుకు రవాణా విభాగంలో సరికొత్త రికార్డును నమోదు చేసింది. జోన్ తొలిసారిగా నెలవారీ ప్రయాణీకుల ఆదాయంలో రూ. 500 కోట్ల మార్కును దాటింది.
మంచిర్యాల జిల్లాలోని నస్పూర్ శివారులో నిర్మించిన నూతన సమీపృత కలెక్టరేట్ కార్యాలయాన్ని ఈనెల 9న సీఎం ప్రారంభిస్తారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంచిర్యాల జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్ తెలిపారు.
హైదరాబాద్ లోని హైదర్ గూడ ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ముందు జీహెచ్ఎంసి పారిశుధ్య కార్మికులు ఆందోళన చేశారు. సూపర్ వైజర్ శ్రీనివాస్ తమను మానసికంగా, లైగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ పారిశుధ్య కార్మికులు ధర్నాకు దిగారు.
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో.. వారికి శిక్ష పడుతుంది. భవిష్యత్ లో టీఎస్పీఎస్సీ నిర్వహించే పరీక్షలు రాయకుండా 13 మందిని డిబార్ చేయాలని కమిషన్ నిర్ణయించింది. వేటుకు గురైన అభ్యర్థులు రెండు రోజుల్లో వివరణ ఇవ్వొచ్చని తెలిపింది.
తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్, సైబర్ నేరాలు చాపకింద నీరులా విస్తరిస్తున్నాయి. దాన్ని నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువత అటువైపు అడుగులు వేయకుండా జాగ్రత్తలను తీసుకుంటోంది. విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి డ్రగ్స్ సరఫరా కాకుండా ఉండేందుకు కఠిన చర్యలు తీసుకుంటుంది. రాష్ట్ర ప్రభుత్వం రెండు కొత్త వింగ్ లను రాష్ట్ర హోం శాఖ స్టార్ట్ చేసింది.