India Schedule for ICC World Cup 2023: భారత్ వేదికగా జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023కి సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను ఐసీసీ ప్రకటించింది. ఆక్టోబర్ 5న అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ మధ్య మెగా టోర్నీ మొదటి మ్యాచ్ జరగనుంది. నవంబర్ 15, 16న ముంబై , కోల్‌కతా వేదికగా సెమీ ఫైనల్ మ్యాచ్‌లు.. నవంబర్ 19న అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచ్ జరగనుంది. ప్రపంచకప్ 2023లో భారత తమ తొలి మ్యాచ్‌లో ఆక్టోబర్ 8న చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఇక అక్టోబర్ 15న చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో భారత్ తలపడనుంది.
వన్డే ప్రపంచకప్ 2023లో మొత్తం 10 జట్లు పాల్గొంటాయి. రౌండ్ రాబిన్ ఫార్మాట్‌లో ప్రతి జట్టు మిగిలిన తొమ్మిది జట్లతో లీగ్ మ్యాచ్‌లు ఆడుతుంది. టాప్ 4 జట్లు సెమీ ఫైనల్‌కు చేరుకుంటాయి. ఆపై రెండు జట్ల మధ్య ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జరుగుతుంది. ఇక హైదరాబాద్, ధర్మశాల, ఢిల్లీ, లక్నో, పుణె, మబై, అహ్మదాబాద్, బెంగళూరు, చెన్నై, కోల్‌కతా వేదికలుగా మెగా టోర్నీ మ్యాచ్‌లు జరగనున్నాయి. తిరువనంతపురం, గువాహటి వార్మప్ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
వన్డే ప్రపంచకప్ 2023లో హైదరాబాద్ మూడు మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. అక్టోబర్ 6న పాకిస్తాన్, క్వాలిఫయర్ 1 మధ్య మ్యాచ్ జరగుతుంది. అక్టోబర్ 9న న్యూజీలాండ్, క్వాలిఫయర్ 1 మధ్య మ్యాచ్ ఉంటుంది. అక్టోబర్ 12న పాకిస్తాన్, క్వాలిఫయర్ 2 మధ్య మ్యాచ్ జరగుతుంది. హైదరాబాద్‌లోని ఉప్పల్ స్టేడియంలో మూడు మ్యాచ్‌లు జరిగినా భారత్ మాత్రం ఆడడం లేదు. ఇది హైదరాబాద్ అభిమానులకు నిరాశ కలిగించింది. ఉప్పల్ స్టేడియంలో కేవలం మూడు మ్యాచ్‌లు మాత్రమే ఉండడంతో బీసీసీఐఫై మండిపడుతున్నారు.
హైదరాబాద్ మ్యాచ్‌లు:
PAK vs Qualifier 1, అక్టోబర్ 6, హైదరాబాద్
NZ vs Qualifier 1, అక్టోబర్ 9, హైదరాబాద్
PAK vs Qualifier 2, అక్టోబర్ 12, హైదరాబాద్
భారత్ మ్యాచ్‌లు:
ND vs AUS, అక్టోబర్ 8, చెన్నై
IND vs AFG, అక్టోబర్ 11, ఢిల్లీ
IND vs PAK, అక్టోబర్ 15, అహ్మదాబాద్
IND vs BAN, అక్టోబర్ 19, పూణే
IND vs NZ, అక్టోబర్ 22, ధర్మశాల
IND vs ENG, అక్టోబర్ 29, లక్నో
IND vs Qualifier 2, నవంబర్ 2, ముంబై
IND vs SA, నవంబర్ 5, కోల్‌కతా
IND vs Qualifier 1, నవంబర్ 11, బెంగళూరు
Also Read: Benefits of Bottle Gourd: ఈ కూరగాయల రసం తాగితే.. కీళ్ల నొప్పుల సమస్యకు ఇట్టే చెక్ పెట్టొచ్చు!