Allu Arjun : పుష్ప సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయారు స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం తాను లెక్కల మాస్టారు సుకుమార్ డైరెక్షన్లో పుష్ప సీక్వెల్ షూటింగులో బిజీగా ఉన్నాడు. పుష్ప2కోసం యావత్ చిత్ర పరిశ్రమ, అల్లు అర్జున్ అభిమానులు ఆతృతతో ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా వీలైనంత త్వరగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మూవీ టీం కృషి చేస్తోంది. ఇక ఈ మధ్యకాలంలోనే అల్లు అర్జున్ హైదరాబాదులో మహేష్ బాబు ఏఎంబి తరహాలో AAA పేరుతో మల్టీప్లెక్స్ ని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ థియేటర్లో చాలా ప్రత్యేకతలు ఉన్నాయట. అయితే హైదరాబాదులో అల్లు అర్జున్ కు ఉన్న బిజినెస్ లు తెలిస్తే మీరంతా షాక్ అవడం ఖాయం..వాటి గురించి తెలుసుకుందాం..
Read Also:Kanaka Durga temple: దుర్గ గుడిలో మరో వివాదం.. వైరల్‌గా మారిన వీడియో
అల్లు అర్జున్ కు హైదరాబాదులో ఉన్న బిజినెస్ లలో మొదటిది ఇటీవల ప్రారంభించిన AAA Multiplex. ఈ మల్టీప్లెక్స్ ను అత్యాధునిక హంగులతో నిర్మించారు. దీనిలో చాలా ప్రత్యేకతలున్నాయట. మన సౌత్ లోనే మొట్టమొదటి ఎల్ఈడి స్క్రీన్ ఉన్న థియేటర్ ఇదే. ఇక అల్లు అర్జున్ మరొక బిజినెస్ వైల్డ్ వింగ్స్ బఫే. ఈ బిజినెస్ ని అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ రోడ్ నం.36 లో ప్రారంభించారు. ఇది చాలా రద్దీ ఏరియా. అలాగే ఈ బార్ అండ్ రెస్టారెంట్లో ఫుడ్ చాలా బాగుండడంతో చాలామంది ఇక్కడ ఫుడ్ తినేందుకు ఇష్టపడి వస్తుంటారు.
Read Also:PV Narasimha Rao: పీవీ నరసింహారావుకు నివాళులు అర్పించిన తలసాని, సత్యవతి
ఇక అల్లు అర్జున్ కి హైదరాబాదులో అల్లు స్టూడియో ఉంది. అల్లు స్టూడియోని ఈ మధ్యకాలంలోనే తన తాతయ్య అల్లు రామలింగయ్య స్మారకార్థం నిర్మించారు. ఈ స్టూడియోలో పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు షూటింగ్ లు కూడా జరుగుతాయి. ఇక ఈ అల్లు స్టూడియో జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10 లో ఉంది. ఇక అల్లు అర్జున్ మరో బిజినెస్ ఆహా ఓటీటీ ప్లాట్ ఫామ్. ఆహా ఓటిటి ప్లాటా ఫామ్ దిగ్గజ ఓటిటి అమెజాన్, నెట్ ప్లిస్ లకు పోటీగా వచ్చి కొద్ది రోజుల్లోనే చాలా ప్రాచుర్యం పొందింది. ఇక ఆహా ఓటిటిలో తెలుగు వెబ్ సిరీస్ సినిమాలు చూడవచ్చు. అలాగే రీజనల్ ఓటిటి యాప్స్ లో ఆహా ప్లాట్ఫారమ్ నెంబర్ వన్ ప్లేస్ లో ఉంది. హైదరాబాదు లోని ఈ బిజినెస్ లతో అల్లు అర్జున్ నెలకి కోట్లలోనే సంపాదిస్తున్నడట.