ఉస్మానియా ఆస్పత్రిపై గవర్నర్ తమిళి సై ఆ వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం అని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు.
2015, జూలైలో ఉస్మానియాను ముఖ్యమంత్రి కేసీఆర్ సందర్శించారు. అప్పట్లో 200 కోట్లు ఖర్చు చేసి నూతన బిల్డింగ్ కట్టాలని నిర్ణయించారు. కొంతమంది కోర్టుకు వెళ్లి స్టే తెచ్చారు. నిపుణుల కమిటీ ఒక నివేదికను కోర్టుకు నివేదించాము ఆయన తెలిపారు.
Read Also: Monsoon Tips : వర్షాకాలంలో పిల్లల ఆరోగ్యం కోసం అద్భుతమైన చిట్కాలు..!
కోర్టు ఐఐటీ హైదరాబాద్, డైరెక్టర్ ఆర్కియాలజీ మెంబర్లు కమిటీ వేశారు. ఇండిపెండెంట్ ఎక్స్ పర్ట్ కమిటీ కూడా పురాతనమైన భవనాన్ని కూల్చి వేయమని రిపోర్ట్ ఇచ్చిందని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు. కోడిగుడ్డు మీద ఈకలు పీకే విదంగా.. బురద జల్లే ప్రయత్నం గవర్నర్ చేస్తున్నారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వొచ్చు కానీ.. ఆరోపణలు చేయడం మంచిది కాదు అని ఆయన అన్నారు. వైద్య సిబ్బంది చాలా కష్టపడుతున్నారు.. కంటి వెలుగు మీద ఒక్క సారి కూడా మెచ్చుకోలేదు అని గవర్నర్ పై హరీశ్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also: Home Vastu Tips: ఇంట్లో ఈ దిశలో వాటర్ ఫౌంటైన్ ఉంటే.. అయస్కాంతంలా డబ్బును ఆకర్షిస్తుంది!
వైద్య సిబ్బందిని మెచ్చుకోవడానికి గవర్నర్ కు మనస్సు రాలేదు.. గవర్నర్ కు మంచి కనబడదు.. చెడును మాత్రం భూతద్దం పెట్టి చూపిస్తున్నారు. చెడు చూస్తాం, చెడు చెప్తాం, చెడు వింటాం అని గవర్నర్ అంటే ఎట్లా? అని మంత్రి హరీష్ రావు ప్రశ్నించారు.
సీజనల్ వ్యాధుల పట్ల వైద్యాధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలి అని ఆయన సూచించారు. మలేరియా నిర్దారణ కోసం 8 లక్షల ర్యాపిడ్ కిట్స్ అందుబాటులో పెడుతున్నాం.. డెంగ్యూ నిర్దారణ కోసం 1లక్ష 23వేల కిట్లు ఎలైజ కిట్స్ అందుబాటులోకి తీసుకోచ్చాం.. ప్లేట్ లెట్స్ ఎక్కించడం కోసం బ్లడ్ కంపోనెట్స్ మిషన్స్ ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉంచామని మంత్రి హరీశ్ రావు పేర్కొన్నారు.