Hyderabad Traffic: బక్రీద్ కారణంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు.. ఆ ఏరియాకు వెళ్లొద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బక్రీద్ పండుగను పురస్కరించుకుని రేపు మీరాలం ఈద్గాలో నిర్వహించనున్న సామూహిక ప్రార్థనల నేపథ్యంలో పాతబస్తీలో ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. మీరాలం ఈద్గా వైపు వచ్చే వాహనాలను ప్రార్థనలు ముగిసేంత వరకు దారి మళ్లించనున్నట్లు వెల్లడించారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు ఈ నిబంధనలు అమలులో ఉంటాయి. పురానాపూల్, కామాటిపురా, కిషన్‌బాగ్ నుంచి ప్రార్థనల కోసం మీరాలం ఈద్గాకు వచ్చే వాహనాలను బహదూర్‌ఫురా ఎక్స్ రోడ్డు మీదుగా రావాలని తెలిపారు. వీరు తమ వాహనాలను జూపార్కు ఏరియాలో, ఓపెన్ స్పేస్ ఎదురుగా మసీదు అల్లాహో అక్బర్ వద్ద పార్క్ చేసుకోవాలని సూచించారు.
Read Also: Jagananna Amma Vodi: కురుపాంలో సీఎం పర్యటన.. నేడే వారి ఖాతాల్లో రూ.13 వేలు జమ
Also Read
- CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
- యూఎస్ ఓపెన్ 2026 విజేత Alexander Zverev.. తల్లికి భావోద్వేగ నివాళి.!
- Rajasthan Local Body Elections: వసుంధరా రాజే రాజకీయ కోటకు బీటలు.. బీజేపీకి భారీ షాక్..!
- Balapur Ganesh 2026: పూరి జగన్నాథ ఆలయాన్ని తలపించేలా భారీ సెట్టింగ్.. బాలాపూర్ గణేశుడి వద్ద కనువిందు
ఈ టైంలో సాధారణ వాహనాల రాకపోకలకు పర్మిషన్ లేదని సీపీ సీవీ ఆనంద్ తెలిపారు. వీరిని బహదూర్‌పురా ఎక్స్ రోడ్డు వద్ద కిషన్‌బాగ్, కామాటిపురా, పురానాపూల్ వైపు దారి మళ్లించామని అని చెప్పారు. శివరాంపల్లి, దానమ్మ హట్స్ నుంచి ప్రార్థనల కోసం వచ్చే వాహనాలను దాన్నమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతి ఉంటుంది. వీరు తమ వాహనాలను ఈద్గా ప్రధాన రహదారి ముందు, మోడ్రన్ సా మిల్ పార్కింగ్‌తో పాటు మీరాలం ఫిల్టర్ బెడ్, మీరాలం బెడ్ పక్కన ఖాళీ ప్లేస్ లో, కార్లను, యాదవ్ పార్కింగ్ పక్కన పార్క్ చేసుకోవాలని తెలిపారు. ఈ టైంలో ఇతర వాహనాల రాకపోకలను ఈద్గా వైపు పర్మిషన్ లేదన్నారు.
Read Also: WhatsApp LPG Gas Booking: వాట్సప్‌లో ఒక్క మెసేజ్ పెడితే చాలు.. గ్యాస్ సిలిండర్ ఇంటికి వచ్చేస్తుంది!
సాధారణ వెహికిల్స్ ను దానమ్మ హట్స్ ఎక్స్ రోడ్డు దగ్గర శాస్త్రిపురం, నవాబ్‌సాబ్‌కుంట తదితర ప్రాంతాల నుంచి దారి మళ్లించనున్నట్లు నగర పోలీసులు తెలిపారు. కాలాపత్తర్, మీరాలం ట్యాంక్ వైపు నుంచి వాహనాలను కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ మీదుగా ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు అనుమతించమన్నారు. వీరు తమ వాహనాలను భయ్యా పార్కింగ్, ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వద్ద పార్క్ చేసుకోవాలని సూచించారు. సాధారణ వాహనాలను కాలాపత్తర్ పోలీస్‌స్టేషన్ వద్ద మోచీ కాలనీ, బహదూర్‌పురా, షంషీర్‌గంజ్, నవాబ్‌సాబ్‌కుంట వైపు మళ్లించారు.
Read Also: Big Pay Hike: టీచర్లకు గుడ్‌న్యూస్.. భారీ వేతన పెంపును ప్రకటించిన సర్కారు!
పురానాపూల్, బహదూర్‌పురా వైపు నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులతో పాటు భారీ వాహనాలను పురానాపూల్ దర్వాజా వద్ద జియగూడ, సిటీ కాలేజీ వైపు దారి మళ్లించనున్నారన్నారు. ఉదయం 8 నుంచి 11.30 గంటల వరకు శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి నుంచి బహదూర్‌పురా వైపు వచ్చే అన్ని ఆర్టీసీ బస్సులతో సహా భారీ వాహనాలను ఆరాంఘర్ జంక్షన్ దగ్గర శంషాబాద్, రాజేంద్రనగర్, మైలార్‌దేవ్‌పల్లి వైపు దారి మళ్లించనున్నారు.
తాజావార్తలు
-
Tharun – Eesha: జంటగా గణపయ్య పూజలో తరుణ్ భాస్కర్ – ఈషా రెబ్బ ! ఇక పెళ్లికి అఫీషియల్ ప్రకటన వచ్చినట్లేనా ?
-
Ajit Agarkar-BCCI: బీసీసీఐ కీలక సమావేశం.. అజిత్ అగార్కర్ భవిష్యత్తుపై ఉత్కంఠ!
-
Sanju Samson: సంజు శాంసన్.. ముందుంది ముసళ్ల పండగ! అంతా నీచేతుల్లోనే ఇగ!
-
CM Revanth Reddy: బాహుబలి సీన్‌ను రీక్రియేట్.. వినాయక మండపంలో రేవంత్ రెడ్డి విగ్రహం!
-
Oppo Find X10: ఒప్పో Find X10 సిరీస్‌లో మూడు మోడల్స్.. గ్లోబల్ లాంచ్‌కు సిద్ధం.. 200MP కెమెరా, 8,000mAh బ్యాటరీ
ట్రెండింగ్
-
Ganga Aarti in London: లండన్‌లో తొలిసారి గంగా హారతి.. థేమ్స్ నది తీరంలో ఆధ్యాత్మిక సందడి.!
-
Ragi Drumstick Leaves Roti: డయాబెటిస్, బీపీ ఉన్నవారికి సంపూర్ణ ఆహారం.. సంపూర్ణ పోషణనిచ్చే ‘రాగి మునగాకు రొట్టె’ చేసేయండి ఇలా.!
-
Beetroot Pachadi: బీట్రూట్ అంటే నచ్చదా? ఇలా పచ్చడి చేసి పెట్టండి.. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారు.!
-
India Women: నాలుగింటిలో నాలుగు.. ఆరింటిలో నాలుగు.. ఆసియా కప్‌లో భారత్ హవా!
-
Rajyogam: 200 ఏళ్ల తర్వాత అరుదైన యోగం.. ఈ 5 రాశుల వారికి పట్టిందల్లా బంగారమే..!