Harish Rao: పుట్టుక నుండి చావు దాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ అని ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. KPHB డివిజన్ 5 వ ఫేస్ లోధ టవర్స్ సమీపంలో 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
Call Money: రోజు రోజుకూ తెలంగాణ రాష్ట్రంలో కాల్ మనీ మాయలో పడి ఎంతో మంది బాధితులు తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. పోలీసులు ఎన్ని వార్నింగ్‌లు ఇచ్చినా.. ఇలాంటి వారిని నమ్మవద్దని ఎన్ని సలహాలు ఇచ్చినా.. ఇలాంటి వారి నుంచి ఎన్ని బెదిరింపులు వచ్చినా..పోలీసులకు ఆశ్రయించాలని చెబుతున్నా పట్టించుకునే నాథుడు లేడు.
ఈరోజుల్లో డబ్బుకు ఉన్న విలువ మానవ సంబంధాలకు లేవని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.. డబ్బు ముందు అయినవాళ్ళను కూడా లెక్కచేయ్యడం లేదు.. తాజాగా ఓ యువతి తన అవసరానికి రెండు వేలు డబ్బులను తీసుకుంది.. కానీ ఆ అవసరంను ఆసరాగా తీసుకొని ఓ వ్యక్తి అతి దారుణంగా మోసం చేశాడు.. ఆమెపై పలు మార్లు లైంగిక దాడి చేసిన ఘటన ఆలస్యంగా హైదరాబాద్ లో వెలుగు చూసింది.. స్నేహితుడిని నమ్మి నట్టేట్లో మునిగిన హైదరాబాద్‌కి చెందిన ఓ…
Hackers: సైబర్ మోసాలు ప్రపంచానికి అతిపెద్ద సవాలు. ఒక్క చోటే కాదు... అన్ని చోట్లా ఈ నేరాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. సైబర్ నేరగాళ్ల అకృత్యాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది.
Fish Prasad: నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో చేప ప్రసాదం పంపిణీకి సర్వం సిద్ధమైంది. ప్రభుత్వం కూడా భారీ ఏర్పాట్లు చేసింది. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.
Mumbai Most Expensive Indian City For Expats: ప్రవాసులకు దేశంలో అత్యంత ఖరీదైన నగరంగా ముంబై మొదటిస్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో న్యూఢిల్లీ, బెంగళూర్ నగరాలు వరసగా రెండూ మూడు స్థానాల్లో నిలిచాయి. మెర్సెర్ 2023 కాస్ట్ ఆఫ్ లివింగ్ సర్వే ప్రకారం, ఐదు ఖండాలలోని 227 నగరాల్లో సర్వే నిర్వహించారు. గ్లోబల్ ర్యాంకింగ్స్ ను పరిశీలిస్తే 147 స్థానంలో ముంబై నిలిచింది.
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ నెల 16, 17వ తేదీల్లో హైదారాబాద్‌కు రానున్న నేపథ్యంలో.. అధికారులు సమావేశం కానున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై రేపు సీఎస్ శాంతికుమారి అధ్యక్షతన అధికారులతో సమన్వయ సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి కార్యక్రమాలు, షెడ్యూల్ విడుదల కానుంది.
Ganja Seller: అతను ఓ పానీపూరీ వ్యాపారి. బాగానే సాగుతున్న అతని వ్యాపారంలో కొత్తగా ఇంకోవ్యాపారం మొదలు పెట్టాడు ప్రభుద్దుడు. తన అతితెలివితో పానీపూరీ చాటున అక్రమ దందాను మొదలుపెట్టాడు.