Terrorists Arrested: హైదరాబాద్‌లో ఉగ్ర కదలికలు.. ఇద్దరు అరెస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఉగ్రవాదులుగా అనుమానిస్తూ ఇద్దరిని గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకోవడం పెద్దపల్లి జిల్లా గోదావరిఖనిలో కలకలం రేపింది. ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నవారు గోదావరిఖనిలోని శ్రీనగర్ కాలనీలో ఉంటున్నారన్న సమాచారం అందుకున్న గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ బృందం మంగళవారం రాత్రి మహమ్మద్ జావిద్ తో పాటు అతని కూతురు ఖతిజాను అదుపులోకి తీసుకున్నారు. జావిద్ హైదరాబాద్ లోని అమీర్ పేట్ లో ఓ కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్లో సాఫ్ట్ వేర్ ట్రైనర్ గా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: No Work No Pay: ‘నో వర్క్ నో పే’.. ప్రభుత్వ ఉద్యోగులకు మణిపూర్ సర్కారు కొత్త నిబంధన!
Also Read
- Sonam Wangchuk: "అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా".. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
- 170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
- Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో 'క్రిస్పీ బైట్స్'.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
- Rahul Gandhi and PM Modi: నేడు రాహుల్.. రేపు మోడీ.. చెన్నైలో వరుస కీలక కార్యక్రమాలు
తండ్రి కూతుర్లు టోలి చౌక్ లో నివాసం ఉంటున్నారు. బక్రీద్ పండగ కోసం తండ్రి కూతుర్లు గోదావరిఖనికి వచ్చినట్టు సమాచారం. అయితే తండ్రి కూతుర్లు ఏ టెర్రరిస్ట్ సంస్థతో సంబంధాలు ఏర్పర్చుకున్నారు.. వీరి ప్రమేయం ఎంత మేర అన్న విషయాలు తెలియాల్సి ఉంది. సాంకేతికంగా టెర్రరిస్ట్ సంస్థలకు సహకరిస్తున్నారా లేక ఇతరాత్ర సహాకారం అందిస్తున్నారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. ఉగ్ర కార్యక్రమాల్లో చురుగ్గా తండ్రికూతుళ్లు పాల్గొన్నారని సమాచారం మేరకు.. కేవలం అనుమానితులుగా మాత్రమే వీరిని తీసుకెళ్తున్నామని ఏటీఎస్ బృందాలు స్థానిక పోలీసు అధికారులకు తెలిపాయి. వీరి ఆచూకి తెలుసుకుని మరీ రామగుండం పారిశ్రామిక ప్రాంతానికి వచ్చి అదుపులోకి తీసుకోవడం సంచలనంగా మారింది.
Read Also: Inflation: ‘టమాటా’ బాటలోనే ‘ఉల్లి’.. ఆర్బీఐ ఏం చేయబోతుంది?
ఏది ఏమైనా మరో సారి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉగ్ర కార్యకలాపాలకు సంబంధించిన వారి గురించి గుజరాత్ ఏటీఎస్ టీమ్స్ రంగంలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది. హైదరాబాద్‌లో ఐఎస్‌కేపీ ఉగ్రవాద లింకులు బయటపడటంతో సూరత్‌కు చెందిన సుబేరా భానుతో పాతబస్తీవాసి ఫసీతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. దేశంలో ISKP ఉగ్రవాద కార్యకలాపాలను ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీనగర్‌కు చెందిన నాసీర్, హయత్, అజీమ్‌లతో కూడిన ముఠా సభ్యుల్ని సుబేరా భాను సురత్‌కు పిలిచింది. అయితే, ఉగ్ర కార్యక్రమాలకు పాల్పడుతున్న ఫసీని కూడా గుజరాత్ ఏటీఎస్ టీమ్ అదుపులోకి తీసుకుంది.
తాజావార్తలు
-
Sonam Wangchuk: “అందుకే ఢిల్లీ నిరసనకు దూరంగా ఉన్నా”.. ప్రొటెస్ట్‌కు ముందు సోనమ్ వాంగ్‌చుక్ సంచలన ప్రకటన..
-
170 Trains Cancelled: ఏకంగా 170 రైళ్లు రద్దు.. 9 రైళ్ల రూట్లలో మార్పులు.. ముందే చెక్ చేసుకోండి..
-
Crispy Snacks: నూనెను ఎక్కువగా పీల్చుకోకుండా బొంబాయి రవ్వతో ‘క్రిస్పీ బైట్స్’.. తినడం మొదలు పెడితే గిన్నె ఖాళీ కావాల్సిందే.!
-
West Indies History: టీ20ల్లో వెస్టిండీస్ నయా చరిత్ర.. అత్యంత విజయవంతమైన ఛేజింగ్ లిస్ట్ ఇదే!
-
Yash-Hanuma Reddy: ఏంటి మావా ఇది.. టాలీవుడ్ కొత్త దర్శకుడితో రాకీ భాయ్ పాన్-ఇండియా మూవీ?
ట్రెండింగ్
-
How to Get Rid of Lizards at Home: ఇంట్లో బల్లులు ఎక్కువగా ఉన్నాయా? ఈ సింపుల్ చిట్కాలతో తరిమేయండి!
-
50MP కెమెరా, 32MP సెల్ఫీ షూటర్, 10,200mAh బ్యాటరీతో Vivo Y600s Pro లాంచ్.!
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!