Vishwanath & Sons: 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘విశ్వనాథ్ & సన్స్’ సినిమా టీజర్ విడుదలైంది. ఈ టీజర్ ద్వారా సంజయ్ విశ్వనాథ్ అనే పాత్ర యొక్క ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. టీజర్‌లో సూర్యని సంజయ్ విశ్వనాథ్ అనే అంతర్జాతీయ పిస్టల్ షూటర్ పాత్రను చూపించారు. 40 ఏళ్ల వయసులో కూడా తన కలలను వదలకుండా ముందుకు సాగుతున్న వ్యక్తిగా అతడిని పరిచయం చేశారు. సూర్య ఈ సినిమాలో తండ్రి ప్రేమ, ఎమోషనల్ డెప్త్ రెండూ కలిసిన ఒక పాత్రలో కనిపిస్తున్నారు. ఆయన తెరపై కనిపించిన తీరు, వెంకీ అట్లూరి రాసిన ప్రభావవంతమైన సంభాషణలు.. సూర్య సినీ ప్రయాణంలో చిరస్థాయిగా నిలిచిపోయిన అద్భుతమైన ప్రదర్శనలను గుర్తు చేస్తున్నాయి.
Also Read :Sree Leela : అవమానించిన శ్రీ లీల ..వీడియో రిలీజ్ చేసిన నటుడు
Also Read
- Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
- DC on Onemore OTT : మరో ఓటీటీలోకి కనగరాజ్ గ్యాంగ్‌స్టర్ హిట్ ‘DC’.. ఎక్కడ, ఎప్పుడు చూడాలంటే?
- Ranabaali Censor Report: వివాదాస్పద అంశాలున్నా ‘రణబాలి’కి సింగిల్ కట్ లేకుండా U/A!
- Rangasthalam: అయ్యో ఎంతపనాయె.. సమంత 'రామలక్ష్మి' పాత్ర వదులుకున్న స్టార్ హీరోయిన్!
కథకు కొత్తదనాన్ని జోడించే పాత్రలో మమితా బైజు కనిపిస్తున్నారు. ఆమె పాత్ర సినిమాలో ఉత్సాహం, చురుకుదనం తీసుకొస్తుందని టీజర్ సూచిస్తోంది. వయస్సు అంతరం ఉన్న అసాధారణ ప్రేమకథను కూడా ఈ సినిమా చూపించబోతున్నట్టు టీజర్‌లో చూచాయగా తెలిపారు. 40 ఏళ్ళ అంకుల్’ని 20 ఏళ్ళ అమ్మాయి లవ్ చేస్తే? అనే కోణంలో ఈ సినిమా ఉండనున్నట్టు అర్ధమవుతోంది. సున్నితమైన భావోద్వేగాలతో అందమైన కథ చెప్పడం వెంకీ అట్లూరి శైలి. తనదైన ప్రత్యేక శైలి రచనతో.. ఈ అంశాన్ని కూడా లోతుగా, భావోద్వేగ పరిపక్వతతో మధురానుభూతిని కలిగించేలా చూపిస్తారు అనడంలో సందేహం లేదు. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్ర సాంకేతిక విలువలు ఉన్న స్థాయిలో ఉండబోతున్నాయని టీజర్ తో స్పష్టమైంది. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన నేపథ్య సంగీతం, విజువల్స్‌ను మరింత ఎలివేట్ చేసింది. నిమిష్ రవి ఆకట్టుకునే ఫ్రేమ్‌లతో సినిమాను కెమెరాలో బంధిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడు బంగ్లాన్ ప్రేక్షకులను కథలో లీనం చేసేలా ప్రత్యేకమైన ప్రపంచాన్ని సృష్టించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై నిర్మితమవుతున్న ఈ సినిమా, విజయవంతంగా చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ‘విశ్వనాథ్ & సన్స్’ చిత్రం ఈ ఏడాది జూలైలో ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది.
తాజావార్తలు
-
Muhammad Yunus: ‘నువ్వు టెర్రరిస్టువి’.. న్యూయార్క్ ఎయిర్‌పోర్టులో మహమ్మద్ యూనస్‌కు నిరసన సెగ!
-
Himanta Biswa Sarma: డీకే శివకుమార్ కాలర్ పట్టిన రాహుల్ గాంధీ.. ‘‘అహంకారం’’ అంటూ హిమంత విమర్శలు..
-
Telangana: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో తెలంగాణ వాసి మృతి.. ప్రభుత్వం కీలక నిర్ణయం
-
Viral : స్వీట్ బాక్స్ అడిగితే రూ.కోట్ల ఆర్డర్లు.. చివరకు ఇల్లు ఖాళీ చేసిన ఇన్ఫ్లుయెన్సర్!
-
Vishwa Prasad : ‘ది రాజా సాబ్’ రిజల్ట్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ షాకింగ్ కామెంట్స్.. అసలు తప్పు అక్కడేనట!
ట్రెండింగ్
-
200MP కెమెరా, Hasselblad లెన్స్ తో OPPO Find X10 సిరీస్.. ఇండియాలో లాంచ్ అప్పుడే.!
-
Production No.3: పాన్ ఇండియా లెవెల్ లో ఆది సాయికుమార్ కొత్త సినిమా.. భయపెట్టే పోస్టర్‌తో అనౌన్స్మెంట్.!
-
Kitchen Cleaning Tips: కిచెన్‌లో జిడ్డు పేరుకుపోతోందా? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా నివారించండి!
-
Sarah Dambanevana: క్రికెట్లో విషాదం.. మాజీ క్రికెటర్, అంతర్జాతీయ అంపైర్ సారా కన్నుమూత.!
-
Niti Taylor: నువ్వు నాతో పడుకోవాల్సిందే.. సౌత్ డైరెక్టర్ పై నటి సంచలన వ్యాఖ్యలు.!