ఉప్పల్ భగాయత్ లేఔట్ లో మిగిలి పోయిన 63 ప్లాట్లను వేలానికి హెచ్ఎండీఏ ( HMDA ) పెట్టింది. ఉప్పల్ భగాయత్ లో 464 గజాల నుండి 11,374 గజాల వరకు ప్లాట్లు ఉన్నాయి. జూన్ 27 వరకు రిజిస్ట్రేషన్ గడువు ఇచ్చింది హెచ్ఎండీఏ, 28 వరకు ఈఎండీ చెల్లించడానికి అవకాశం ఇచ్చింది.
హైదరాబాద్ లో వరుస ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి.. వాహనాలను వేగంగా నడపవద్దని అధికారులు చెప్తున్నా జనాలు లెక్కచెయ్యడం లేదు.. ఇప్పుడు మరో ఘటన వెలుగు చూసింది..తాజాగా ఓ కారు బీభత్సాన్ని సృష్టించింది.. మితిమీరిన వేగంతో ఒక్కసారిగా కారు దూసుకొచ్చింది. పాతబస్తీ రెయిన్ బజార్లో మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ కారణంగా ప్రమాదం జరిగింది.అతివేగంతో వాహనదారుడిపైకి కారు దూసుకెళ్లింది.. ఈ ప్రమాదంలో కారులోని ముగ్గురు మైనర్లకు కూడా గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు..…
తాగొచ్చి రోజు కొడుతూ, వేదిస్తున్నాడని భర్తను భార్య అతి కిరాతకంగా నరికి చంపింది.. ఈ ఘటన పదిహేను రోజుల క్రితం జరిగింది.. శంషాబాద్ పరిధి జూకల్ గ్రామంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు.. తాగొచ్చి వేధిస్తున్నడని భర్తను భార్యే చంపినట్లు తేల్చి ఆమెను అరెస్ట్ చేశారు.. వివరాలిలా.. కర్ణాటకకు చెందిన గడ్డిరాజు వెంకట నాగరాజు(60), నాగమణి(55) దంపతులు బతుకుదెరువు కోసం సిటీకి వచ్చి శంషాబాద్ మండలంలోని జుకల్ గ్రామంలో ఉంటున్నారు. ఆ గ్రామంలోని చందర్…
హైదరాబాద్లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఇవాళ (మంగళవారం) ఎల్బీనగర్ లోని ఓ టింబర్ డిపోలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. అయితే దాని పక్కనే మల్టీప్లెక్స్, అపార్ట్మెంట్లు, పాత కార్లు షోరూమ్ ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు.
వన్య ప్రాణులను తీసుకొచ్చి ప్రదర్శన ఏర్పాటు చేసిన జోరా పబ్ ఓనర్ వినయ్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆయనతో పాటు మేనేజర్ వరహాల నాయుడు, పబ్కి వన్యప్రాణులను సరఫరా చేసిన హైదరాబాద్ పెట్స్ ప్రతినిధులను పోలీసులు అరెస్ట్ చేశారు.
తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
క్యూ నెట్ మల్టిలెవల్ మార్కెటింగ్ పేరుతో మోసం చేస్తున్నారు అని హైదరాబాద్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. పీరమిడ్ స్కీమ్ పేరుతో బోగస్ కంపనీ తో అమాయకులను టార్గెట్ చేశారన్నారు.