Tomato Prices: భగ్గుమంటోన్న టమాటా ధరలు.. దేశవ్యాప్తంగా ఇదే పరిస్థితి.. కారణమిదే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Tomato Prices: దేశంలో టమాటా ధరలు చుక్కల్ని అంటుతున్నాయి. సామాన్యుడికి అందుబాటులో టమాటా ధరలు లేవు. ఇప్పటికే కిలో టమాటా రేటు రూ. 100ను దాటింది. ఇది కొన్ని రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అన్ని మెట్రో సిటీలతో పాటు ప్రధాన నగరాల్లో టమాటా కిలో ధర సెంచరీని చేరింది. ఢిల్లీలో కిలో టమాటా రూ.80గా ఉంది. కాన్పూర్‌లో, టొమాటోల హోల్‌సేల్ ధర కిలోకు రూ.80-90 మరియు రిటైల్ దుకాణాలు కిలోకు రూ. 100 చొప్పున విక్రయిస్తున్నారు. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో టమాటా హోల్ సేల్ ధర కిలోకి రూ.50 ఉండగా.. రిటైల్ ధర రూ.100ను దాటింది. బెంగళూరులో టమాటా ధర కిలో రూ.100 మార్కుకు చేరుకుంది. టొమాటో ధర ఇటీవల కాలంలో కిలోకి రూ.30 నుంచి రూ.50కి పెరిగిందని అక్కడి స్థానికులు చెబుతున్నారు. హైదరాబాద్ లో కూడా టమాటా ధర కిలోకి రూ. 100 పలుకుతోంది.
Also Read
- PM Modi: ఢిల్లీలో నిరసనలు.. చెన్నైలో Gen Zతో మోడీ ముచ్చట్లు.!
- Police VS CJP: అభిజిత్ దీప్కే ఆరోపణలు.. సాక్ష్యంగా ఢిల్లీ పోలీసులు వీడియో రిలీజ్.
- Mahant Rajudas: మోడీ జీ, అలాంటి జెన్-జీపై చర్యలు తీసుకోండి.. సీజేపీపై మహంత్ రాజూదాస్ ఆగ్రహం..
- Abhijeet Dipke: ‘‘సంతకం చేయలేదు, మళ్లీ వీధుల్లోకి వస్తాం’’.. CJP దీప్కే సంచలన ప్రకటన.!
డిపార్ట్‌మెంట్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ ఆధ్వర్యంలోని ధరల పర్యవేక్షణ విభాగం డేటాబేస్ ప్రకారం, రిటైల్ మార్కెట్‌లలో సగటున కిలో టొమాటో ధర ₹25 నుండి ₹41కి పెరిగింది. రిటైల్ మార్కెట్‌లలో టమాటా గరిష్ఠ ధరలు ₹80-113 మధ్య ఉన్నాయి. రుతుపవనాల రాక ఆలస్యం కావడం.. భారీ వర్షాలు, విపరీతమైన వేడి టమాటా పంటపై ప్రభావాన్ని చూపాయని నిపుణులు చెబుతున్నారు. రానున్న కాలంలో కిలో టమాటా ధర రూ.150కి చేరిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. ముఖ్యంగా ఉత్తర భారతదేశానికి దక్షిణాది నుంచే టమాటా ఎగుమతి అవుతుంది. ముఖ్యంగా బెంగళూరు రూరల్, చిత్రదుర్గ, చిక్కబళ్లాపూర్, కోలార్, రామనగర వంటి జిల్లాల్లో టమాటా పంట ఆశించిన స్థాయిలో లేదు. దీంతో కొరత ఏర్పడుతుంది.
కొన్ని రోజలు వరకు టమాటా ధర కిలోకి రూ. 20-30 ఉంటే ఇప్పుడు ధర రూ. 80-120 మధ్య ఉంది. అనిశ్చిత వాతావరణ పరిస్థితుల కారణంగా దాని సరఫరాపై ప్రభావం చూపడంతో టమోటా ధరలు అకస్మాత్తుగా పెరిగాయి. కొన్ని రోజులుగా కర్ణాటకలో వరసగా వర్షాలు పడుతున్నాయని, దీంతో పంట దిగుబడిపై ప్రభావం పడిందని నిపుణులు చెబుతున్నారు. అంతకుముందు వేసవిలో అత్యధిక వేడి కూడా పంటపై ప్రభావం చూపిందని రైతులు చెబుతున్నారు.
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!