హైదరాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ (జేబీఎస్)ను ఇవాళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఎండీ వీసీ సజ్జనార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన ‘మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం’ అమలు తీరుపై ఆయన క్షేత్ర పరిశీలన చేశారు.
హైదరాబాద్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది.. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం జరిగినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు.. మైలార్ దేవ్ పల్లిలో అగ్ని ప్రమాదం సంభవించింది. స్థానిక టాటానగర్ లోని ఓ ప్లాస్టిక్ గోడైన్లో రాత్రివేళ ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి.. ఆ మంటలను చూసి జనం భయబ్రాంతులకు గురయ్యారు.. ప్లాస్టిక్ వస్తువులు కావడంతో మంటలు త్వరగా వ్యాపించాయి.. చుట్టు కొద్ది కిలోమీటర్ల మేరకు దట్టమైన పొగలు వ్యాపించడంతో చుట్టు పక్కల ఉన్న జనాలకు ఊపిరాడని…
తెలుగు రాష్ట్రాల్లో చలిగాలుల తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ఉదయం తొమ్మిది గంటలు దాటినా... మంచు తగ్గడం లేదు. ప్రజలు బయటకు రావాలంటేనే భయపడిపోతున్నారు. హైదరాబాద్‌లో చలిగాలులు విపరీతంగా వీస్తున్నాయి. దీంతో ప్రజలు శ్వాసకోశ ఇబ్బందులను ఎక్కువగా ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలో అడవులు, పర్యావరణం రక్షణకు, పచ్చదనం మరింతగా పెంచేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్ర అటవీ, పర్యావరణ మరియు దేవాదాయ శాఖ మంత్రిగా రేపు ఉదయం 10 గంటలకు (సోమవారం, డిసెంబర్ 11న) కొండా సురేఖ బాధ్యతలు చేపట్టనున్నారు. సచివాలయంలోని నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో (రూమ్ నెంబర్ 410) పూజలు చేసి బాధ్యతలు స్వీకరించనున్నారు.
ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన 6 గ్యారంటీల్లో ఒకటైన ఆరోగ్యశ్రీని తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఆవరణలో సీఎం రేవంత్ రెడ్డి ఈ పథకాన్ని స్టార్ట్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరిన వేళ.. ప్రజలకు ఆరోగ్యశ్రీ కింద వైద్యం కోసం ఖర్చును 10 లక్షల రూపాయలకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
KCR Health News: ఎర్రవెల్లి ఫాంహౌస్‌లోని బాత్రూమ్లో జారి పడిన కేసీఆర్ ప్రస్తుతం హైదరాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాలి ఎముక విరిగిపోవడంతో వైద్యులు శస్త్రచికిత్స చేసి ఎముకను మార్చారు.
కేసీఆర్ కు నాలుగు గంటలకు పైగా హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ చేసిన యశోద ఆస్పత్రి వైద్యులు.. మేజర్ సర్జరీ కావడంతో మరింత పర్యవేక్షణ అవసరం అవుతుంది అని డాక్టర్లు తెలిపారు.
ఇవాళ తెలంగాణ రాష్ట్ర కొత్త అసెంబ్లీ కొలువుదీరనుంది. నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలు సభలో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ప్రజాభవన్ కంచే తొలగిపోవడంతో సీఎం కార్యాలయం చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు వెళ్లారు. కొందరు కళాకారులు ప్రజా భవన్ ఎదుట పాటలు పాడుతూ బై బై కేసీఆర్ అంటూ నినాదాలు చేశారు. అంతేకాకుండా.. అటుగా పోయే వాహనదారులు కూడా ఆగి సీఎం కార్యాలయాన్ని చూసుకుంటూ వెళ్లారు. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి పూర్తిగా కంచే ఉండటం.. జనాల్లో సీఎం కార్యాలయం ఎలా ఉంటుంది అనే క్యూరియాసిటి ఎక్కువగా ఉండేది.. కానీ, ఇప్పుడు పూర్తిగా గేట్స్ ఓపెన్ అయ్యేసరికి జనాలు…