హైదరాబాద్ లోని ఉస్మానియా యూనివర్సిటీ వద్ద కానిస్టేబుల్ అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు. సెలక్షన్ పూర్తయి రెండు నెలలు గడుస్తున్నా.. తమకు ఇంతవరకు ట్రైనింగ్ పంపించకపోవడంపై విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. 2022 ఏప్రిల్ లో నోటిఫికేషన్ ఇచ్చి.. అనంతరం సెలక్షన్స్ పూర్తయినా, మూడు నెలలు గడుస్తున్నా కోర్టు కేసుల పేరుతో తమకు అన్యాయం చేయడంపై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. దుష్ప్రచారాలకు అడ్డుకట్ట వేసి సెలెక్ట్ అయిన అభ్యర్థులందరినీ…
Kothakota Srinivas Reddy appointed as Hyderabad CP: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక ఐపీఎస్ బదిలీలకు మొదటిసారి శ్రీకారం చుట్టుంది. కీలకమైన బాధ్యతల్లో ఉన్న ఐదుగురు ఐపీఎస్ అధికారుల బదిలీలు మంగళవారం జరిగాయి. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ కమిషనర్లను ప్రభుత్వం బదిలీ చేస్తూ నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్ కొత్త పోలీస్ కమిషనర్ (సీపీ)గా కొత్తకోట శ్రీనివాస్ రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాచకొండ సీపీగా సుధీర్ బాబు, సైబరాబాద్ సీపీగా…
తెలంగాణలో డ్రగ్స్ మాట వినపడొద్దు అని తెలిపారు. డ్రగ్స్ నిర్మూలనకు ఏది కావాలంటే అది చేస్తాం.. నార్కోటిక్ బ్యూరోపై పోలీసు అధికారులతో సమీక్షలో కీలక ఆదేశాలు జారీ చేశారు. ఆక్టోపస్ గ్రేహౌండ్స్ లాగా నార్కోటిక్ టీమ్ ని బలోపేతం చేస్తాం.. డ్రగ్స్ నిర్మూలించి దేశానికి తెలంగాణ పోలీస్ రోల్ మోడల్ గా నిలవాలి అని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
హైదరాబాద్ సోమాజీగూడలోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తెలంగాణ మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ ను టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని వైద్యులు చెప్పారని ఆయన తెలిపారు.
ఇవాళ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వరుస రివ్యూలతో సెక్రటేరియట్లో బిజీబిజీగా ఉన్నారు. నేడు ఉద్యోగాల భర్తీపై ఆయన రివ్యూ చేశారు. పూర్తి వివరాలతో రావాలని టీఎస్పీఎస్సీ అధికారులను సీఎం ఆదేశాలు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాడినప్పటి నుంచి ఇప్పటి వరకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ భర్తీ చేసిన ఉద్యోగాల వివరాలతో పాటు నోటిఫికేషన్ల వివరాలతో రావాలని సీఎం ఆదేశించారు.
ప్రజాదర్బార్ కు వచ్చిన ప్రజల సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతులను ఐటీ మంత్రి శ్రీధర్ బాబు స్వీకరించారు. ప్రజల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని శ్రీధర్ బాబు చెప్పారు.
మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. నీటి పారుదల శాఖలో పనులు అత్యంత పారదర్శకంగా ఉండాలి అని సూచించారు. ప్రజల డబ్బులతో మనం ప్రాజెక్టులను కడుతున్నాం.. మనం పూర్తిగా బాధ్యతాయుతంగా, జవాబు దారి తనంతో పని చేయాలి అని తెలిపారు.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని వెల్లడించింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ అధికారం చేపట్టగానే మొదటి గ్యారంటీగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని అమలు చేసింది.