DGP Ravi Gupta: తెలంగాణ డీజీపీ రవిగుప్తా ఇయర్ అండ్ రివ్యూను విడుదల చేశారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోలీసులు, మీడియా సహకారంతో అసెంబ్లీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎన్నికలు పూర్తి చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గతేడాదితో పోలిస్తే 8.97 శాతం నేరాలు పెరిగాయని, ఈ ఏడాది 2,13,121 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది సైబర్ నేరాలు 17.59 శాతం పెరిగాయి. ఈ ఏడాది 1108లో జీరో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని, ఐపీసీ సెక్షన్ కింద 1,38,312 కేసులు నమోదు చేశామని డీజీపీ రవిగుప్తా వెల్లడించారు.
73 రేప్ కేసుల్లో 84 మందికి యావజ్జీవ కారాగార శిక్ష పడిందని, ఈ ఏడాది ఎన్డీపీఎస్ కింద 1,360 డ్రగ్స్ కేసులు నమోదయ్యాయని, గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది డ్రగ్స్ కేసులు 15.6 శాతం పెరిగాయన్నారు. 2,52,60 కిలోల గంజాయి, 1240 గంజాయి మొక్కలు స్వాధీనం చేసుకుని 2583 మందిని అరెస్టు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 1877 ఎస్సీ, ఎస్టీ కేసులు నమోదయ్యాయని, డ్రగ్స్‌పై తెలంగాణ పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని, ప్రభుత్వ ఆదేశాల మేరకు డ్రగ్స్‌పై గట్టి నిఘా కొనసాగుతోందని డీజీపీ స్పష్టం చేశారు. డ్రగ్స్ నియంత్రణకు యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేశామని, 59 డ్రగ్స్ కేసుల్లో 182 మందిని అరెస్ట్ చేశామని డీజీపీ రవిగుప్తా తెలిపారు.
Read also: A Ranjith Cinema : ఓటీటీలోకి వచ్చేసిన మలయాళం సూపర్ హిట్ మూవీ..
175 మంది రిపీట్ డ్రగ్స్ పెడ్లర్లపై పీడీ యాక్ట్ నమోదు చేశామని, 12 మంది విదేశీ నేరస్తులను అరెస్ట్ చేశామని, 536 మంది డ్రగ్స్ వినియోగదారులకు కౌన్సెలింగ్ ఇచ్చామని డీజీపీ తెలిపారు. మహిళలు పై వేధింపులు 19013 కేసులు నమోదు కాగా.. ఇందులో 2284 రేప్ కేసులు, 33 వరకట్న, హత్యలు, 132 వరకట్న మరణాలు, 9458 వరకట్న వేధింపుల కేసులు నమోదయ్యాయి. ఇక మహిళలు హత్యలు 213, 884 మహిళ కిడ్నాప్ లు కేసులు నమోదు కాగా.. ఈ ఏడాది పొక్సో కేసులు 2426, ఒక నిందితుడు కి మరణ శిక్ష విధింపు, 104 మందికి జీవిత ఖైదీ శిక్షలు విధించారని తెలిపారు. ఈ ఏడాది భారీగా సైబర్ నేరాలు పెరిగాయన్నారు. సైబర్ నేరాలు 16339 కేసులు నమోదయ్యాయని తెలిపారు. గత ఏడాది తో పోలిస్తే ఈ ఏడాది 18 శాతం సైబర్ నేరాలు పెరిగాయన్నారు.
యాంటీ నార్కోటిక్ బ్యూరో ద్వారా 59 కేసులు నమోదు చేసి, 182 మంది అరెస్ట్ , 7.99 కోట్లు సీజ్ , 536 మందికి పునరావాసం కల్పించామని తెలిపారు. 32 మంది పై డ్రగ్స్ నిందితులకు పీడీ యాక్ట్ నమోదు చేశామని, NDPS యాక్ట్ లో 12 మంది విదేశీయులు అదుపులో తీసుకున్నామన్నారు. ఇక రోడ్డు ప్రమాదాలు 20 699 కేసుల్లో 6788 మంది మృతి చెందగా.. 19137 మంది గాయాలయ్యాయని తెలిపారు. హ్యూమన్ ట్రాఫికింగ్ 287 కేసులు కాగా.. 557 మంది భాదితులు రెస్క్యూ, 364 మంది ట్రాఫికర్స్ అరెస్ట్ చేశామన్నారు. గ్రే హౌండ్స్ అండ్ ఆక్టోపస్ ద్వారా 132 జరిగాయని, 124 తెలంగాణ లో 8 అంతరాష్ట్రాల్లో ఆపరేషన్ లు నిర్వయించామని క్లారిటీ ఇచ్చారు.
Nitish Kumar: జేడీయూలో పెను మార్పు.. ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడిగా నితీశ్ కుమార్