Amit Shah: బీజేపీ నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హైదరాబాద్ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. అసెంబ్లీ ఫలితాలు, వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, వికాసిత్ భారత్ సంకల్ప యాత్ర, అయోధ్యలో రామమందిరం జీవిత ప్రతిష్ట తదితర అంశాలపై రాష్ట్ర పార్టీ నేతలతో సమీక్షించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు అమిత్ షా చేరుకుంటారు. పార్లమెంట్ ఎన్నికలపై కమలనాథులు దిశానిర్దేశం చేయనున్నారు. ఈరోజు మధ్యహాన్నం 1.25 గంలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకుని అక్కడి నుంచి నేరుగా నోవాటెల్ కు వెళ్లనున్నారు. మధ్నాహ్నం 1.40 నుంచి 6 2.40 వరకు నోవాటెల్ హోటల్లో బీజేపీ ముఖ్యనేతలతో భేటీ కానున్నారు. అనంతరం తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితిలపై రాష్ట్రనేతలతో చర్చించనున్నారు. మద్యాహ్నం 3.05 నిమిషాలకు భాగ్యలక్ష్మి దేవాలయనికి వెల్ అక్కడ అమ్మరి వారికి ప్రత్యేక పూజలతో పార్లమెంట్ ఎన్నికల ప్రచారనికి శ్రీకారం చుట్టనున్నారు.
Read also: Amrit Bharat Express Ticket Price: ‘అమృత్ భారత్’ ఛార్జీలు ఎక్కువే.. కనీస టికెట్ ధర 35!
భాగ్య లక్ష్మి దేవాలయం నుంచి 3.50 గంలకు కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు షా చేరుకోనున్నారు. ఇక మధ్నాహం 3.50 గంటల నుంచి సాయంత్రం 5.20గంల వరకు బీజేపీ విస్తృత స్థాయి సమావేశలలో అమిత్ షా పాల్గొననున్నారు. ఈ సమావేశంలో మండల, ఆ పై స్థాయి నాయకులతో మొదటి సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సబ్యులు ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు. పార్లమెంట్ ఎన్నికలపై రాష్ట్రనేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. అనంతరం 5.40 కి నోవోటల్ చేరుకోనున్నారు. నోవోటల్ బీజేపీ నేతలతో రెండు వేరు వేరు సమావేశలలో పాల్గొననున్నారు. సాయంత్రం 5.50 నుండి 6.10 వరకు మొదటి మీటింగ్ అనంతరం సాయంత్రం 6.10 నుండి 6.40 వరకు మరో మీటింగ్ లో పార్లమెంట్ ఎన్నికలపై చర్చించనున్నారు. కానీ.. ఈ మీటింగ్ లో ఎవరు పాల్గొంటారు అనేది బీజేపీ కార్యకర్తలు గోప్యంగా ఉంచారు. కాగా.. సాయంత్రం 6.50 గంటకుల తిరిగి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి అమిత్ షా ఢిల్లీ బయలు దేరానున్నారు.
Dwaraka: శ్రీకృష్ణుడు నిర్మించిన ద్వారక నగరాన్ని చూడాలనుకుంటున్నారా..?