Rash Driving Case: దుబాయ్ చెక్కేసిన మాజీ ఎమ్మెల్యే షకీల్ కొడుకు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rash Driving Case: రాజ్ భవన్ ప్రజా భవన్ వద్ద ఈనెల 24న అర్థరాత్రి కారుతో బీభత్సం సృష్టించిన కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. కారులో బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సోహైల్ కావడంతో ఈ కేసుపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. అయితే.. ప్రమాదం నుంచి తప్పించుకునేందుకు డ్రైవర్ ని లొంగిపొమ్మని సోహెల్ చెప్పడంమే కాకుండా.. తనకు బదులు డ్రైవర్ అబ్దుల్ ని పోలీస్ స్టేషన్ కి పంపాడు. ప్రమాదం చేసి నేరుగా సోహెల్ ముంబైకి వెళ్లిపోయాడు. ఇక ముంబైకి చేరుకున్న సోహెల్ వెంటనే అక్కడి నుంచి దుబాయ్ కి పారిపోయాడు. దీంతో విషయం వెలుగులోకి రాగానే సోహెల్ కోసం పంజాగుట్ట పోలీసులు లుక్ అవుట్ నోటీసులు జారీ చేశారు. దుబాయ్ లో ఉన్న సోహెల్ ని రప్పించేందుకు పంజాగుట్ట పోలీసులు ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే సోహైల్ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దుర్గరావుపై సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే కొడుకు కేసులో డీసీపీ వెస్ట్ జోన్ పూర్తి స్థాయిలో విచారిస్తున్న క్రమంలో ఇన్‌స్పెక్టర్ అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఈ కేసులోదుర్గారావు వ్యవహారంపై పూర్తిస్థాయిలో విచారణ జరిపిన డిసిపి వెస్ట్ జోన్ ఆయనను సస్పెండ్ చేసింది.
Read also: Purandeswari: మా వ్యూహం మాకుంది.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచే చేస్తా..
Also Read
- Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
- Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
- Ganesh Procession Tragedy: వినాయకుడి ఊరేగింపులో విషాదం.. జనరేటర్ ఫ్యాన్‌కు జుట్టు చిక్కుకుని బాలిక మృతి
- ENG vs SL: హడలెత్తించిన 'హ్యారీ బ్రూక్' సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
బీఆర్ఎస్ బోధన్ ఎమ్మెల్యే షకిల్ కుమారుడు సోహైల్ ఆదివారం (24) అర్థరాత్రి అప్పటి రాజ్ భవన్ ప్రజా భవన్ వద్ద కారుతో బీభత్సం సృష్టించాడు. అతివేగంతో దూసుకొచ్చి ప్రజా భవన్ ముందున్న బారికేడ్లను ఢీకొట్టడంతో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. కొడుకు అరెస్టుతో పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌కు వచ్చిన ఎమ్మెల్యే తన కొడుకును ఈ కేసును తప్పించే ప్రయత్నం చేశారు. ఇందుకు పంజాగుట్ట ఇన్‌స్పెక్టర్ దర్గరావు ఆయనకు సహాకరించి నిర్లక్ష్యంగా వ్యవహరించారు. మాజీ ఎమ్మెల్యే కొడుకు స్థానంలో మరో వ్యక్తిని నిందితుడిగా చిత్రీకరిస్తూ కేసు నమోదు చేశారు. దీంతో ఈ యాక్సిడెంట్ వ్యవహారం రాజకీయాలకు దారితీస్తుండటంతో సమగ్ర దర్యాప్తు జరిపి తనకు నివేదిక ఇవ్వాలని హైదరాబాద్ పోలీస్ కమీషనర్ శ్రీనివాస్ రెడ్డి ఆదేశించడంతో ఇన్‌స్పెక్టర్ దుర్గరావు వ్యవహరం బట్టబయలైంది. ఈ కేసులో ఏ1గా సోహైల్ ప్రస్తుతం పరారీలో ఉండటంతో పోలీసులు లుక్ ఔట్ నోటీసులు జారీ చేశారు.
Purandeswari: మా వ్యూహం మాకుంది.. అధిష్టానం ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడినుంచే చేస్తా..
తాజావార్తలు
-
Mamitha Baiju : ఏడాది తిరగకుండా.. రూ. 1000 కోట్ల క్లబ్లో మమిత బైజు
-
Police Recruitment 2026: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలీస్‌శాఖలో భారీగా ఉద్యోగాలు.. నోటిఫికేషన్లు జారీ
-
Tollywood : సెన్సార్ లేట్.. ఈ వారం సినిమాలు వాయిదా?
-
ChiranjeeviOdela : ‘ప్యారడైజ్’ రిజల్ట్‌పైనే చిరంజీవి – శ్రీకాంత్ ఓదెల ప్రాజెక్ట్ ఆధారపడి ఉందా?
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!
ట్రెండింగ్
-
Jasprit Bumrah: జస్ప్రీత్ బుమ్రా అరుదైన రికార్డు.. టీ20ల్లో సరికొత్త చరిత్ర.!
-
ENG vs SL: హడలెత్తించిన ‘హ్యారీ బ్రూక్’ సెంచరీ.. శ్రీలంకపై ఇంగ్లండ్ రికార్డు విజయం.!
-
బడ్జెట్ సెగ్మెంట్లో 6,000mAh బ్యాటరీ, 50MP కెమెరాతో Samsung Galaxy A08 లాంచ్..!
-
రూ.1,659కే itel Muzik 450L ఫోన్.. థియేటర్ లాంటి సౌండ్, 2,500mAh బ్యాటరీ.!
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!